వివాదస్పద నటి శ్రీరెడ్డి మరోసారి ఆరోపణలు గుప్పించింది. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. క్యాష్ కమిటీలో మళ్లీ ఆ నాలుగు కుటుంబాలనే వేశారు. లా ను వాడుకోమన్నారు. ఇప్పుడు నా పోరాటానికి అదే చేస్తున్నాను. నా పోరాటానికి డబ్బులతో సెటిల్ చేయడానికి , తేజా.. లాంటి చాలా మంది వచ్చారు .నేను డబ్బులు తీసుకున్నానని నిరూపించండి. సురేష్ బాబు ఆడుతున్న నాటకం ఇదంతా. మీడియాను సైతం బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని ఆమె మండిపడ్డారు. ప్రెస్ మీట్ కవర్ చేయరని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కాస్టింగ్ కౌచ్ కోసం తాను మా అసోసియేషన్ ముందు నిరసన చేస్తే మా చర్యలు తీసుకుంటుంది . మరి.. మా అసోసియేషన్ దగ్గర పవన్ హంగామా చేస్తే ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారని శ్రీరెడ్డి నిలదీసింది. నేను పవన్ ను అన్నదానికి క్షమాపణ చెప్పాను. కానీ మీరు రౌడీ యిజాని ఎంకరేజ్ చేస్తున్నారా ని ప్రశ్నించింది. పెద్ద హీరోలకు మేకప్ కు కూడా బయట నుంచి తీసుకు వస్తున్నారు. ఇక్కడ తెలుగు వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. నేను. ఏమీ ఆశించడం లేదు. మా పోరాటం కొనసాగుతుందని శ్రీరెడ్డి స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో నాపై ఎవరు అసత్య, అసభ్య ప్రకటనలు చేశారో అందర్నీ కోర్టుకు ఈడ్చుతాను. వారు పెట్టిన వీడియోలు, స్టింగ్స్ .అన్నీ సేకరించానని ఆమె అన్నారు.