కర్నూలు, జూలై 8,
శిల్పా మోహన్ రెడ్డి.. సీీనియర్ నేత. నంద్యాలలో వైసీపీలో ప్రముఖ నేత. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడు రవిచంద్ర కిశోర్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశమిచ్చారు. దీంతో ఆయన రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. కుమారుడు ఎమ్మెల్యే అయినా నంద్యాల నియోజకవర్గంలో ఆయనదే ఆధిపత్యం. ఇప్పటికీ నియోజకవర్గంలో ఆయన చెప్పినట్లే నడుస్తుంది. ఇవి పక్కన పెడితే శిల్పా మోహన్ రెడ్డికి ఒక పదవి వేచిచూస్తుందన్న టాక్ విన్పిస్తుంది.శిల్పా మోహన్ రెడ్డి 2017లో వైసీపీలో చేరారు. అప్పటి వరకూ ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. భూమానాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన వైసీపీలోకి వచ్చారు. నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో ఆయన పోటీ చేసి భూమా బ్రహ్మానందరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అందుకే 2019 ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి తాను పోటీ చేయకుండా కుమారుడిని బరిలోకి దింపి నెగ్గించుకున్నారు.ఇక ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం ఒక పదవి ఎదురు చూస్తుంది. అదేంటంటే తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవి. 2017లో తన సోదరుడుశిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో అప్పుడే ఎమ్మెల్సీ గా ఎన్నికైన శిలపా చక్రపాణిరెడ్డి కూడా వైసీపీలో చేరారు. కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ షరతు పెట్టడంతో ఆయన ఎమ్మెల్సీ పదవి ఆరేళ్ల సమయం ఉన్నా రాజీనామా చేశారు.స్థానిక సంస్థల ఎన్నిక కావడంతో ఆయన తర్వాత టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాదితో పూర్తికానుంది. స్థానిక సంస్థల కోటా కావడంతో ఈసారి ఈ స్థానం నుంచి శిల్పా మోహన్ రెడ్డికి అవకాశం కల్పించాలన్న డిమాండ్ విన్పిస్తుంది. అయితే ఒకే కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతున్నా, ఆ స్థానం శిల్పా కుటుంబం త్యాగం చేసిందని చెబుతున్నారు. మొత్తం మీద శిల్పా మోహన్ రెడ్డి కోసం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎదురు చూస్తుంది.