YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్... ముందున్న సవాళ్లు

రేవంత్... ముందున్న సవాళ్లు

హైదరాబాద్, జూలై 8, 
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో క్రమంగా పట్టు కోల్పోతున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసి అతనిపై మరిన్ని బాధ్యతలను పెంచింది. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ముందు ప్రధానంగా రెండు ప్రశ్నలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి సీనియర్లు ఎంత సహకరిస్తారనేది మొదటి ప్రశ్న కాగా … తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ఎంత మేరకు పూర్వవైభవం తీసుకోస్తారనేది రెండో ప్రశ్నగా మారింది.తెలంగాణలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉండగా మూడేళ్ళ క్రితం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పేరును పరిశీలనలోకి తీసుకున్న రోజు నుండే ఆ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇవ్వకూడదని విజ్ఞపులు చేసారు. అయితే రాష్ట్ర యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడం, అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ధీటుగా ప్రశ్నించే సత్తా ఉండడంతో రేవంత్ కు పీసీసీ పదవి కలిసివచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే రేవంత్ కు పీసీసీ పదవి రాగానే పార్టీలో సీనియర్లలో అసంతృప్తి నెలకొందనే విషయం వాస్తవం. పలువురు నేతలు రేవంత్ కు పీసీసీ పదవి కట్టబెట్టడంపై బహిరంగంగానే విమర్శలు చేసారు. అయితే సీనియర్లును కలుపుకునే పనిని రేవంత్ ముందే ప్రారంభించారు. బాధ్యతల స్వీకరణకు ముందే దాదాపు అందరూ సీనియర్ నాయకులను కలిసారు. అయితే రానున్న రోజుల్లో రేవంత్ కు పార్టీలో సీనియర్లు ఎంత మేరకు సహకరిస్తారో చూడాలి.రేవంత్ కు అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త జోష్ మొదలైందని చెప్పొచ్చు. ఇదే జోష్ తో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్ ఏ మేర విజయం సాధిస్తారో వేచి చూడాలి. అలానే రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, క్రమంగా బలపడుతున్న బీజేపీలను ఎదుర్కోవడం రేవంత్ ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సవాళ్ళను అధిగమించి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకోస్తారో లేదో త్వరలో తేలనుంది.

Related Posts