YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో పొలిటికల్ జోష్

తెలంగాణలో పొలిటికల్ జోష్

హైదరాబాద్, జూలై 8, 
టీఆర్ఎస్ లో ఒక్కసారిగా పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇష్యూ తర్వాత ఒక్కసారిగా నేతల టూర్లు పెరిగాయి. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు గ్రామాల్లో తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జిల్లాల్లో పర్యటించారు. వరంగల్, సిద్ధిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసాలమర్రిలో ఏకంగా జనంతో సహపంక్తి భోజనం చేశారు. చాలాచోట్ల అడక్కుండానే వరాలజల్లు కురిపించారు. వెళ్లిన ప్రతిచోట పంచాయతీలకు, మున్సిపాల్టిలకు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వీలున్న ప్రతిచోట మెడికల్ కాలేజీనో.. ఇంజనీరింగ్ కాలేజీనో మంజూరు చేస్తే వచ్చారు. ఇక మంత్రులు కూడా పల్లె, పట్టణ ప్రగతి పేరుతో జనంలో తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా రైతు వేదికల పేరుతో జనంలోకి వెళ్లారు. ఇక ఏపీ అక్రమ ప్రాజెక్టులపై రోజూ మంత్రులు, పాలమూరు ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే హుజురాబాద్ బైపోల్ నేపథ్యంలోనే టీఆర్ఎస్ లో ఒక్కసారిగా యాక్టివిటీ పెరిగిందన్న వాదనలు వినబడుతున్నాయి. ఎప్పుడూ లేనిది సీఎం విపక్షాలకు అపాయిట్మెంట్ ఇవ్వడం, దళిత్ ఎంపర్మెంట్ పేరుతో అందరినీ పిలిచి మాట్లాడ్డం కూడా ఇందులో భాగమేనన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. బీజేపీలో కూడా ఒక్కసారిగా పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరడం దగ్గర నుంచి యాక్టివిటీస్ ఇంకా పెరిగాయి. వరుస మీటింగ్ లతో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. ఈమధ్యనే అనుబంధ మోర్చాలతో మీటింగ్ పెట్టారు. నిత్యం జనంలో ఉండేలా కార్యాచరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టి ఆందోళనలు చేస్తున్నారు బీజేపీ లీడర్లు. మరోవైపు బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు.. పాదయాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8 నుంచి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, భూపాలపల్లి, వేములవాడ, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. అలాగే ఆగస్టు 9నుంచి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్తున్నారు సంజయ్. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఇప్పటికే హుజురాబాద్ బైపోల్ పై ఫోకస్ పెట్టారు. పార్టీ గెలుపు కోసం కమిటీలు కూడా వేశారు. కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకంతో ఆపార్టీలో కూడా కొత్త జోష్ కనబడుతోంది. కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నప్పటికీ వాళ్లతో పార్టీ హైకమాండ్ నేరుగా మాట్లాడి బుజ్జగిస్తోంది. సీతక్క మినహా.. పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా స్పందించలేదు. మరోవైపు రేవంత్ రెడ్డి.. పార్టీ సీనియర్ నేతలందరినీ కలుస్తున్నారు. రేపు బాధ్యతల స్వీకరణ సందర్బంగా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే గాంధీభవన్ ను అందంగా ముస్తాబు చేశారు. వాస్తు మార్పులు కూడా చేయిస్తున్నారు. బాధ్యత స్వీకారం కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు వచ్చేలా ప్లాన్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలకు ఆహ్వానం కూడా పంపారు.  అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక జనంలోకి వెళ్లేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు లీడర్లు. తెలంగాణ వేదికగా కొత్త పార్టీతో రాబోతున్నారు వైఎస్ షర్మిల. 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించారు. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఆవిర్బావ సభ నిర్వహించారు. ఇదే వేదికపై పార్టీ జెండా, అజెండాను ప్రకటించారు. ఇప్పటికే జనం సమస్యలపై ఎప్పటికప్పుడు ట్టిట్టర్ లో ప్రశ్నిస్తున్నారు వైఎస్ షర్మిల. అలాగే ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలన షర్మిల స్వయంగా వెళ్లి పరామర్శించారు. రైతు సమస్యలపై కూడా నేరుగా వాళ్లతోనే మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి జల వివాదాలపై కూడా వెనక్కి తగ్గేదిలేదని గట్టిగానే చెప్పుకొస్తున్నారు ఆపార్టీ నేతలు.

Related Posts