YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సర్వే కు కలిసొస్తున్న కాలం

సర్వే కు కలిసొస్తున్న కాలం

హైదరాబాద్, జూలై 8, 
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి స‌ర్వే స‌త్యనారాయ‌ణ కు కాలం క‌లిచి వ‌చ్చిన‌ట్టేనా ? తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా యువ నేత‌, ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టబోతున్న నేప‌థ్యంలో స‌ర్వే మ‌ళ్లీ పుంజుకుంటారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీల‌క నేత‌గా ఉన్న స‌ర్వే స‌త్యనారాయ‌ణ ప‌క్కా తెలంగాణ వాదిగా పేరుబ‌డ్డారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయ‌న అప్పట్లో కేంద్రాన్ని ఒప్పించిన‌వారిలో ఒక‌రుగా గుర్తింపు పొందారు. అయితే.. వ‌రుస‌గా పార్టీ ఓట‌మి, తెలంగాణ ఇచ్చినా.. పార్టీ పుంజుకునేలా క్షేత్రస్థాయి నాయ‌క‌త్వం ప‌నిచేయ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాల‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శలు చేసేవారు.అంతేకాదు, అప్పటి కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపైనా స‌ర్వే స‌త్యనారాయ‌ణ తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. ఉత్తమ్ కాదు.. ఉత్తర కుమారుడ‌ని బ‌హిరంగ స‌భ‌ల్లోనే సెటైర్లు పేల్చారు. దీంతో ఇది వివాదంగా మారి.. ఉత్తమ్‌.. స‌ర్వే స‌త్యనారాయ‌ణను స‌స్సెండ్ చేసే వ‌ర‌కు విష‌యం దారి తీసింది. అయితే.. తానే కాంగ్రెస్ పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడిన‌ని.. త‌న‌ను స‌స్పెండ్ చేసే అవ‌కాశం లేద‌ని వాదిస్తూ ఎదురు దాడి చేశారు. ఇక‌, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌ను బీజేపీ నేత‌లు క‌ల‌వ‌డం.. దీనిపై స‌ర్వే స‌త్యనారాయ‌ణ గుంభ‌నంగా ఉండడం..లోపాయికారీగా వ్యవ‌హ‌రించ‌డం.. వంటి ప‌రిణామాలతోపాటు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక‌, పుంజుకుంటుందా ? అనే సందేహాలు రావ‌డంతో స‌ర్వే స‌త్యనారాయ‌ణ పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.అయితే.. రాజ్యస‌భ సీటును ఆశించిన స‌ర్వేకు బీజేపీ నుంచి ఇప్పటి వ‌ర‌కు స‌మాధానం రాలేదు. దీంతో ఆయ‌న సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే.. ఇప్పుడు పార్టీలో కొత్త ప‌వ‌నాలు చోటుకోవ‌డం.. రేవంత్ వంటి కీల‌క నాయ‌కుడు ప‌గ్గాలు చేప‌ట్టడంతో స‌ర్వే స‌త్యనారాయ‌ణకు మంచి రోజులు వ‌చ్చాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రేవంత్‌కు స‌ర్వేకు మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌డం.. యువ నాయ‌క‌త్వం రావాలంటూ.. గ‌తంలోనే సర్వే ప్రక‌టించ‌డం వంటి రీజ‌న్లు.. ఈ ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీని బ‌ల‌ప‌రుస్తుంద‌ని అంటున్నారు.పైగా స‌ర్వే స‌త్యనారాయ‌ణ రేవంత్ కోస‌మే మ‌ల్కాజ్‌గిరి సీటు వ‌దులుకున్నారు. వీరిద్దరి మ‌ధ్య మంచి అనుబంధ‌మే ఉంది. అదే స‌మ‌యంలో రేవంత్‌కు కూడా కాంట్రవ‌ర్సీ వ్యాఖ్యలు చేయ‌ని స‌ర్వే స‌త్యనారాయ‌ణ వంటి సీనియ‌ర్ నేత‌ల మ‌ద్దతు కూడ‌క‌ట్టుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్‌కు పీసీసీ ప‌ద‌వి రావ‌డాన్ని చాలా మంది సీనియ‌ర్లు వ్యతిరేకిస్తున్న స‌మ‌యంలో స‌ర్వే స‌త్యనారాయ‌ణ వంటి వారు త‌న పంచ‌న ఉంటే.. బ‌లం పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నాడు. ఇక ఇన్నాళ్లు మౌన‌మునిలా ఉన్న స‌ర్వేకు ఇప్పుడు త‌న స‌పోర్టర్‌కు పీసీసీ ప‌గ్గాలు రావ‌డంతో మంచి రోజులు వ‌చ్చాయ‌నే అంటున్నారు.

Related Posts