సంసారము విషమమైనది. విషయమన విషముతో నిండినదని మనము వినుచున్నాము. జీవుడి ప్రపంచమునకు వచ్చిన ప్పటి నుండి ప్రపంచమును పరిత్యజించు వరకు ఈ |శరీరముచే చేయబడిన కార్యకలాపములు, వ్యవహారములు వాని వలన కలిగిన సుఖదుఃఖములు మున్నగు నవియే సంసారము, జీవుడు తన జీవితకాలములో ఒకప్పుడు సత్కార్యము, మఱియొకప్పు డసత్కార్యము, ఒకప్పుడు సరియగు వ్యవహారము, మఱియొకప్పుడు సరికాని వ్యవహారము చేయుటవలన ఒకప్పుడు సుఖము, మఱియొకప్పుడు దుఃఖము ననుభవించుచున్నాడు. సంసారములోని విషయము విషముతో సమానమని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. విషయము విషమెట్లు కాగలదు? విషయము అనగా ధనజనవాహనములు. అవి లేనిచో జీవుని జీవితమెట్లు గడుచును? విషముతోపరిస్థితిని బట్టి దానిని స్వీకరించినచో పశితమునిచ్చును. కాని ఔషధమునందు ఆసక్తి కలిగి మితిమీరి తీసుకున్నచో అనారోగ్యానికి దారి తీయతీయను.ఔషధముస్వీకరించునప్పుడు పత్యముకూడ సేవించవలెను. కేవలము ఔషధము వలన శరీరము నిలువదు. అట్లే విషయం నందు ఆసక్తి లేనివాడై శాస్త్రోక్తముగా వానినంగీకరించి సాధు సజ్జనుల ను నాశ్రయించి. భగవంతుని గూర్చి శ్రవణ కీర్తనాదులను చేసినచో అప్పుడువిషయముకూడాఅమృతమే.సాధుకృప వలననే ఇట్టిసౌకర్యము అదృష్టముజీవునకులభించును.విషయాసక్తి కలిగియున్న సంసారమునందు నిమగ్నులైయున్నది బద్ధజీవుల జీవితము. ఎగుడు దిగుడుగను,గుంటలు,రాళ్ళురప్పలతో, నిండియున్నది. గుడ్డివాడు చేతిలో ఊతకట్ట కూడ లేదు. ఎదురుదెబ్బ తగిలి మాటిమాటికి జారిపడుచున్నాడు. పరిస్థితిలో ఒక దృష్టిశక్తి గలవాడు ఆగుడ్డి వానికి ఊతకఱ్ఱము గమ్యస్థానమునకు చేర్చకలిగినప్పుడే ఆయనకు ఉపకారము చేసినట్లగును. అలాగే సంసారమనే సాగరం నుండి భగవంతుని వైపు అడుగులు వేయడానికి వూతకర్ర లా సద్గురువుల బోధనలు,సాంగత్యం , ఉపదేసములు ఉపయోగ పడుతుంది.
శాస్త్రపరిజ్ఞానము లేని వాడగుట వలన అనిపుణుడై.. భక్తి రసాస్వాదనమునకై తేనెటీగల తుట్టెనుండి మధువునకు పోయిఈగలచేకుట్టబడికష్టములపాలైనట్లు అన్ని రంగములు వేశించి అకృతార్థుడై పెక్కు విధములుగ పరితపించుచుండును. వీరేఅంధులు.ఇట్టి స్థితిలో భగవత్ భక్తులు, సర్వశాస్త్రపారంగతులు, ఇంద్రియ నిగ్రహమును ఆరితేరినవారు. సర్వానుభవములు కలవారు, సర్వవిధములుగా రసికశేఖరుడైన శ్రీకృష్ణుని ఆశ్రయించినవాడు నగు సాధువునాశ్రయించి వారి యువదేశము పొందినవారు ధన్యులు కాగలరు.
శాస్త్రములు నేత్రములు. శాస్త్రజ్ఞానమే దృష్టి శక్తి. అట్టి శాస్త్రజ్ఞానము గలవారును, శాస్త్రజ్ఞానమును సద్వృత్తిని అనుసరించువారును సాధువులు. మాయాముగ్ధులు బద్దజీవులు, శాస్త్రజ్ఞానమును సంపాదించుటకు వారికి కుతూహలము ఉండదు. విషయములను సంపాదించుటలోనే వారి కుతూహలము పరిపూర్ణమైన శాస్తజ్ఞానము లేకుండుటవలన సుఖదుఃఖములను కలిగించు కార్యముల పరిచయము వారికి ఉండదు. అందువలన సర్వజ్ఞులును. సర్వశాస్త్రవేత్తలును, సర్వేంద్రియములను నియమించినవారునగు సాధువులు దయతో తమకు గల విషయపరిజ్ఞానముతో " కూడిన శాస్త్రజ్ఞానమనేడు ఊతకఱ్ఱ బద్ధజీవుడనెడు గ్రుడ్డివానికి నిచ్చినప్పుడు, అతడు దాని సంగీకరించి జీవిత ప్రయాణమును సాగించినప్పుడు సుఖదుఃఖము లనెడు ద్వంద్వములకు అతీతుడై పరమశాంతిని, అనుభవింపగలరు.
సాధువును ఆశ్రయించి జీవుడు తన " జీవితములో సద్వృత్తులను సాధింప కలిగినచో వాని జీవితము కృతార్థము కాగలదు. ఈ విషయమున శ్రీలరూపగోస్వామిపాదులిట్లు చెప్పారు.
గురుపాదశ్రయస్తస్మాత్ కృష్ణదీక్షాదిలక్షణమ్ || విశ్రాంభేణ గురోసేవా సాధువర్మాను వర్తనమ్ ॥
ఇచ్చట గురుపాదపద్మముల నాశ్రయించవలెననియు, గురుదేవుని నుండి కృష్ణ మంత్రోపదేశమును పొందవలెననియు, అనగా సంబంధాబిధేయ ప్రయోజనములను గూర్చి తెలిసికొనవలెననియు, గురుదేవుని విశ్వాసముతో సేవింప వలయును, సాధుమార్గము అవలంబింప వలెననియు అనగా శ్రేష్టులైన సాధువుల ఆచరణములను గూర్చి వినవలెననియు, చూడవలెననియు, దాని ననుసరించి జీవితమును గడుపవలెననియు ఇందులో గురు లక్షణములను గూర్చి శ్రీమద్భాగవతము లో
తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసు: శ్రేయః ఉత్తమమ్ || శాబ్దిపరేచ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమశ్రయమ్ ||
ఉత్తమమైన శ్రేయస్సును కోరువాడు సర్వశాస్త్ర పారంగతుడును, పరబ్రహ్మనిష్ణాతుడును,ఇంద్రియములను లో జయించిన వాడును, ప్రశాంతమైన చిత్తము గలవాడును నగు గురువు నాశ్రయింపవలెనని ఇందులో విదితము.సద్గుణములయొక్క ఆధార స్వరూపుడైన భగవంతుణ్ణి ఆశ్రయించుట అంటే సంపూర్ణ శరణాగతి పొందటము.
భగవానునిపై అంచనభక్తి గల వారికి సర్వదేవతలతోపాటుసర్వసద్గుణములు చక్కగ నుండును. భగవద్భక్తి లేని వారికి ఎట్లు లభించును.మనోరథముపై నధిరోహించి వారు అసద్విషయముల పరుగిడుదురు కదా? భగవంతుడు సర్వసద్గుణనిలయుడు. ఆయనను సేవించిన వారికి ఆయనలోని సకల సద్గుణములు లభించును. దీనిని బట్టి భగవత్ సేవ నిరతులును సర్వసద్గుణములు గల వారునగు భక్తులే సాధువులని తేలినది.
అట్టి సాధువుల కృప అనెడు కఱ్ఱను పట్టుకుని ప్రవర్తించు వారి జీవితము సార్థకము. అట్టివారే కష్టనష్టముల కతీతులై పరమశాంతి ననుభవింపగలరు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో