YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ లో ఆందోళన తీవ్ర తరం

స్టీల్ ప్లాంట్ లో ఆందోళన తీవ్ర తరం

విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆందోళన తీవ్ర తరం చేసాయి. ప్లాంట్ లోనికి వెళ్ళకుండా కార్మికులు గేటు వద్దే కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. స్ట్రేటజిక్ సేల్ కు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలు 147 రోజులకు చేరాయి.  కేంద్రం వెనక్కు తగ్గకుండా  ప్లాంట్ ను అమ్మేందుకు ప్రణాళికలు రూపోందిస్తుంది.  అందుకు సంబంధించి న్యాయ పరమ్తెన సమస్యలు తలేత్తకుండా, లిగల్ ఎడ్వజరీ కమిటీని ఎర్పాటు చేసింది. దీంతో కార్మికులు ఆందోళన తీవ్రతరం చేసారు. మెయిన్ గేటు వద్ద వేలాదిగా కార్మికులు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.   గేటు ముందే కుర్చుని ఆందోళన చేసారు. ప్రవేటు పరం చేస్తే చూస్తూ వూరుకోమని హెచ్చరించారు.  స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఇళ్ళు, భూములు త్యాగం, 32మంది అమరవీరుల త్యాగం, కార్మికులు కష్టం విశాఖ స్టీల్ .... ఇది స్టీల్ ప్లాంట్ కాదు. ఆధునిక దేవాలయం.  స్ట్రేటజిక్ సేల్ విషయాన్ని వెనక్కుతీసుకునేంతవరకు ఆందోళన ఆగదని అన్నారు.

Related Posts