YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు దేశీయం విదేశీయం

పారిస్‌లో ఉన్న భార‌తీయ ఆస్తుల‌ను కెయిన్ ఎన‌ర్జీ సంస్థ జ‌ప్తు!

పారిస్‌లో ఉన్న భార‌తీయ ఆస్తుల‌ను కెయిన్ ఎన‌ర్జీ సంస్థ జ‌ప్తు!

న్యూఢిల్లీ జూలై 8
పారిస్‌లో ఉన్న భార‌తీయ ఆస్తుల‌ను స్కాట్‌లాండ్‌కు చెందిన కెయిన్ ఎన‌ర్జీ సంస్థ జ‌ప్తు చేయ‌నున్న‌ది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేర‌కు సుమారు 20 ప్రాప‌ర్టీల‌ను ఆ సంస్థ స్వాధీనం చేసుకోనున్న‌ది. ఆ ప్రాప‌ర్టీల‌ విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఓ కేసు విష‌యంలో సెటిల్మెంట్‌లో భాగంగా ఈ సీజ్ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.కెయిన్ ఎన‌ర్జీ సంస్థ దాఖ‌లు చేసిన ఓ కేసులో.. అంత‌ర్జాతీయ ట్రిబ్యున‌ల్‌ కోర్టు భార‌త్‌కు 1.2 బిలియ‌న్ల డాల‌ర్ల జ‌రిమానా విధించింది. దానిలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ఆస్తుల‌ను ఆ కంపెనీ స్వాధీనం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. భార‌తీయ ప్రాప‌ర్టీల‌ను అమ్మ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆదాయం కెయిన్ సంస్థ‌కు వెళ్తుంద‌ని ట్రిబ్యున‌ల్ త‌న తీర్పులో వెల్ల‌డించింది.2014లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భార‌త్ ఉల్లంఘించినట్లు ట్రిబ్యున‌ల్ పేర్కొన్న‌ది. ఈ విష‌యంపై గ‌తంలో ఆ సంస్థ ప‌లు దేశాల్లో భార‌త్‌పై కేసు న‌మోదు చేసేందుకు ప్ర‌య‌త్నించింది.

Related Posts