రాయదుర్గం జూలై 8
అనంతపురం జిల్లా పర్యటలో బాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో సీఎం జగన్ మొక్కను నాటారు. అనంతరం రాయదుర్గం మార్కెట్ యార్డులో వైఎస్సార్ ఇంటిగ్రెటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.2.10 గంటలకు వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ చేరుకుంటారు. 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.