YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ వీడేది లేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ వీడేది లేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి
తనకు చాలా పార్టీల నుండి ఆఫర్లు వచ్చాయి కానీ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని వారికి స్పష్టం చేశానని అన్నారు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన... స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు... అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో  కొనసాగుతున్న కొత్తగా  పి సి సి కమిటీ లో ఉన్న నాయకులు అందరూ వారి వారి నియోజకవర్గం లోకి వెళ్లి ప్రజలతో కలిసి వారి వారి స్థానాలను తిరిగి గెలుచుకోవాలని కోరారు. ఇప్పుడు తెలంగాణలో   రాజశేఖర్ రెడ్డి లాగా తమ పార్టీ అభ్యర్థులు అందరిని గెలిపించుకునే దమ్మున్న ఉన్న నేత కాంగ్రెస్ లేడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లో, నేను నా పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గం లో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించుకోలేకపోయామని అన్నారు. పార్టీ లో గ్రూపు రాజకీయాలు చేస్తే  బొందల గడ్డ లకు  వెళ్తామని కార్యకర్తలకు హితవు పలికారు. గాంధీ భవన్ లో కూర్చుంటే ఎన్నికలలో గెలవలేమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.... ప్రజలతో మమేకమై గ్రూపులు లేకుండా పనిచేసినప్పుడే కాంగ్రే స్ పార్టీ గెలుస్తుందని, అధికారంలోకి వస్తుందని అన్నారు. లక్షల కోట్లు సంపాదించిన కేసీఆర్ ఓడించాలంటే పార్టీలో  అందరూ కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల పార్టీ కి ఆల్ ది బెస్ట్ చెబితే దాన్ని ఓ ఛానల్ లో బ్రేకింగ్ వేశారని, మీలో ఎవరైనా పార్టీలు స్థాపించుకోవచ్చు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ఎవరైనా పని ప్రారంభించే ముందు అల్ ది బెస్ట్ చెబుతామని. అంత మాత్రాన పార్టీ మరినట్లేనా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

Related Posts