YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

11, 42వ డివిజన్లలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంగుల

11, 42వ డివిజన్లలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంగుల

కరీంనగర్
స్వయం పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేదే సిఎం కెసిఆర్ ఆలోచన అని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారని బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
పట్టణ ప్రగతి లో భాగంగా గురువారం నాడు 42 ,11 వ డివిజన్ లలో మంత్రి గంగుల కమలాకర్ విస్తృతంగా  పర్యటించారు... హరితహారంలోభాగంగా మొక్కలు నాటి  వంగిపోయిన , రోడ్డుమధ్యలో ఉన్న స్తంభాలు తొలిగించే కార్యక్రమానికి కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభించారు.. 11 డివిజన్ లోని పార్క్ సందర్శించి పార్కులోని ఆవరణను పరిశీలించారు. అనంతరం హరిహరనగర్ కాలనీ రోడ్డులో 22 లక్షల మున్సిపల్ నిధులతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు... అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.   ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ  గత 40 నుంచి 50 సంవత్సరాలుగా అభివృద్ది కోసం నిధులు రాక సమస్యలు అలాగే పేరుకుపోయాయన్నారు. కానీ ఇప్పుడు సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో నేరుగా ప్రభుత్వం నుండి నిధులు వస్తూ పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ది చెందుతుంటే పట్టణాలు మరింత ఆధునీకరణ చెందుతున్నాయన్నారు.
కరీంనగర్ లో గతంలో ఇళ్ళ పై నుండి వెళ్తున్న విద్యుత్ లైన్లతో ఎంతో మంది ఇండక్షన్ గురై ప్రాణాలను సైతం కోల్పోయారని, కానీ ఇప్పుడు స్వయం పాలనలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటూనే కరీంనగరాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులకు ప్రజలు సహకరించాలని, హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అడవులు అంతరించిపోయి వాతావరణంలో సమతుల్యత లోపించి సకాలంలో వర్షాలు రాకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. దీంతో వానాకాలంలో ఎండలు, ఎండా కాలంలో అకాల వర్షాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సమతుల్యత లోపించిన వాతావరణాన్ని గాడిన పెట్టి వానలను వాపసు తీసుకువచ్చేందుకు సిఎం కెసిఆర్ తెలంగాణకు హారితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటుతూ  వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్ లో గతంలో రోడ్ల వెడల్పులో చెట్లను నరికారే కానీ  తిరిగి నాటలేదని,  దీంతో  కరీంనగర్ చెట్లు లేక మోడు వారిపోయిందన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భావితరాల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశముందని, ఇందుకోసం నగరాల్లో సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామన్నారు.  రెండు నుంచి ఐదు ఎకరాల ఖాళీ స్థలముంటే అందులో యాదాద్రి తరహా మియావాకి అడవులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో కేవలం ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులే కాదు.  ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు లోపిస్తున్న పర్యావరణ సమతుల్యతతో భావితరాలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని... వారి భవిష్యత్తుకు బంగారు బాటాలు వేయాలంటే ఇప్పుడు మనం మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. 7వ విడుత హరితహారంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 34 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్న మంత్రి గంగుల.  అర్భన్ లో 10  లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామని, ఇందులో కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో 5 లక్షలు, మిగతా మున్సిపాలిలిటీల్లో మరో 5 లక్షలు నాటుతామని,  మిగతా 24 లక్షలు పల్లెల్లో నాటాలని నిర్ణయించామన్నారు. గత 6విడుతల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాదు. వాటిలో 90 శాతం మొక్కలను సంరక్షించామన్నారు. ఈ మొక్కలు వృక్షాలైతే... రాబోయే కాలంలో కాంక్రీట్ జంగిల్ గా ఉన్న కరీంనగర్ జిల్లా హరిత వనంగా మారనుందన్నారు. అలాంటి హరితహారం కార్యక్రమాన్ని పవిత్ర యజ్ఞంగా భావించి పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో స్వఛ్ఛందంగా భాగస్వాములై... పెద్ద ఎత్తున మొక్కలు నాటి... కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి వల్లూరు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి - హరిశంకర్ డివిజన్ కార్పొరేటర్లు మేచినేని వనజ - అశోక్ రావు ఆకుల నర్మద- నర్సయ్య  మరియు కాలనీవాసులు పాల్గొన్నారు

Related Posts