YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

డోర్నకల్ లో పోలీసుల రక్తదానం

డోర్నకల్ లో పోలీసుల రక్తదానం

తోటి వారి ప్రాణాలను కాపాడటమే మానవత్వం. శాంతి భద్రతల రక్షణలోను, ప్రేండ్లీ పోలీసులుగా ముందుకు సాగుతున్న మహబూబాబాద్ జిల్లా పోలీసులు తమ ఉనికిని మరోమారు చాటుకున్నారు. డోర్నకల్ మండల కేంద్రంలోని జైన్ భవనంలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్నిమహబూబాబాద్ జిల్లా యస్ పి నంద్యాల కోటిరెడ్డి ప్రారంభించారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిదానాలలో రక్తదాన మిన్న అని ఒక్క వ్యక్తి ఇచ్చిన రక్తంతో ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చుని అన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పెద్దన్న పాత్రను పోషింస్తానని ప్రతి పౌరుడు నైతిక విలువలు పాటించి ప్రజలకు సేవ చేసేలా జీవితాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పోలీసులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన  లభించింది. 200మంది యువకులుపాల్గొని రక్తదాన చేశారు.   తొలుత మహబూబాబాద్ జిల్లా యస్ పి గా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా కోటిరెడ్డి కేక్ కట్ చేశారు.

Related Posts