YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైయస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర..

వైయస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర..

వైయస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర..
వేలేరుపాడు
మండలం మేడేపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సంబందించిన శాఖల అధికారుల గురించి వారివారి పదకముల గురించి.. వివరంగా చెప్పారు.  గ్రామ సర్పంచ్ కట్టం రాంబాబు  మాట్లాడుతూ.. గిరిజన రైతులకు అనేక పథకాలు అందించడంలో రైతు భరోసా కేంద్రాలు ఎంతగానో దోహద పడుతున్నాయని అన్నారు.  కొద్ది రోజుల ముందు 90శాతము రాయితీపై గిరిజనులకు వరి విత్తనాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  కానీ 90% రాయితీ వచ్చే విత్తనాలు ప్రతి ఒక్క రైతుకి అదేవిధంగా ఎక్కువ మొత్తంలో  విత్తనాలు తేవాలని అన్నారు. ఆవులు, గేదేలు తినడానికి అవసరమైన గడ్డి జాతి విత్తనాలు కూడా సబ్సిడీలో  గిరిజన రైతులకు అందించాలని సర్పంచ్ కట్టం రాంబాబు  కోరారు. వేలేరుపాడు మండల వ్యవసాయశాఖ అధికారి కె. గంగడరావు మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రం అనేది కేవలం రైతుల గురించి ఎర్పటు చేసిన కార్యలయమని, రైతులకు వ్యవసాయం పరంగా ఎటువంటి చిన్నా అవసరాలు వచ్చిన వారికి రైతు భరోసా కేంద్రం అందుబాటులో ఉంటుందని, అదేవిధంగా రానున్న సంవత్సరకాలంలో 90 శాతం రాయితీ - మరిన్ని ఎక్కువ వరి విత్తన బస్తాలను తెప్పించే ఏర్పాటు చేస్తామని, చెప్పడం జరిగిందని, వాటితోపాటుగా రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కూడా కిమాస్కో ద్వారా అందించడం జరుగుతుందని, పురుగు మందుల దుకాణదారులు ఎవరైన అధిక ధరలకు ఎరువులు, పురుగు మందులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. గంగధరావు, గ్రామ సర్పంచ్ కట్టం రాంబాబు, ఏఈఓ తిరుపతిరావు, వ్యవసాయ,  అనుబంధ శాఖల  అధికారులు రైతులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గోన్నారు.

Related Posts