YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం

జగన్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం

జగన్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం
అనంతపురం :
రాయదుర్గం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ,  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిందలు వేయడం మీద టిడిపి హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే  బి కే పార్థసారథి  ఘాటుగా స్పందించారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షించారని, 16000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, కావాల్సిన అన్ని భవనాలు నిర్మించారని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును దాదాపు 70% పూర్తి చేసినా, ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పోనీ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేదని తెలిపారు. రాయలసీమ సస్యశ్యామలం చేసేందుకు ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తరువాత చంద్రబాబు కృషి వల్ల త్వరితగతిన నిధులు తెచ్చి గొల్లపల్లి రిజర్వాయర్ కు నీళ్ళు తెచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వముదే అని చెప్పారు. ఈ గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కీయా కార్ల కంపెనీ 13000 కోట్ల రూపాయలతో వెనుకబడిన అనంతపురం జిల్లాలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జాబ్ క్యాలెండర్ అని జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను రోడ్డుపై పడ వేశారు అని తెలిపారు. ప్రతి రోజూ కేంద్ర ప్రభుత్వ కాళ్ల పైన పడి అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు అని, జగన్ ప్రభుత్వం 41000 కోట్ల రూపాయలకు లెక్కలు లేవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిచ్చి తుగ్లక్ పరిపాలన చేస్తున్నట్లు ఉందని, 3 రాజధానులు అని చెప్పి ఆ ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ విపరీతంగా పెంచి, సామాన్య ప్రజల పైన భారం పడుతోంది. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పన్ను తక్కువ ఉండడం వల్ల అక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువ ధరకే లభిస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పెట్రోలు ధర మీద 9 రూపాయలు పన్ను తగ్గించారు.

Related Posts