YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ ప్రతుల విడుదల

ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ ప్రతుల విడుదల

ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ ప్రతుల విడుదల
ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు 'దోస్త్' ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి ప్రక్రియ
 కామారెడ్డి జులై 09
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోడ ప్రతుల విడుదల,
ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు 'దోస్త్' ద్వారా డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పొందడానికి ప్రక్రియ ప్రారంభం అయిందని,
శుక్రవారం కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అడ్మిషన్లకు సంబంధించి గోడ ప్రతులను  విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర కాంత్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,  
వినూత్నమైన కోర్సులతో, 158 ఎకరాల సువిశాల ప్రాంగణంలో గత 58 ఏండ్లుగా విద్యాసేవ చేస్తున్న కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రత్యేకతలని వివరిస్తూ,
కామారెడ్డి పట్టణంలో న్యాక్ గుర్తింపు పొందిన ఏకైక డిగ్రీ కళాశాల అని,  అలాగే విద్యాసేవలో భారత నాణ్యతా ప్రమాణాల సంస్థ ఐ ఎస్ ఓ ఓ గుర్తింపు పొందిన జిల్లాలోని ఏకైక కళాశాల. సి. బి. సి. ఎస్.పద్ధతిలో విద్యాబోధన. ఉంటుందన్నారు.
విశాలమైన తరగతి గదులు,  నెట్, సెట్, ఎంఫిల్, పీహెచ్.డి.వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన ఉంటుందని, అత్యాధునిక వసతులు గల సైన్స్, కంప్యూటర్ ప్రయోగశాలలు,
బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఎన్.సి.సి, ఎన్. ఎస్.ఎస్. విభాగాలు ఉన్న జిల్లాలోని ఏకైక కళాశాల అని,రాష్ట్రంలోనే ప్రఖ్యాతి పొందిన ఫారెస్ట్రీ, ఫిషరీస్ కోర్సులు ఉన్న ఏకైక కళాశాల అని అన్నారు.
ఫారెస్ట్రీకి క్షేత్రస్ధాయి అధ్యయనం కోసం రాశివనం, బొటానికల్ గార్డెన్, ఫిషరీస్ విద్యార్థుల కోసం ఫిష్ పాండ్ సదుపాయాలు ఉన్నాయని, టి ఎస్ కె సీ  ఆధ్వర్యంలో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ, ప్లేస్ మెంట్స్ వుంటాయని, అన్ని రకాల పోటీ పరీక్షలు, పీజీ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ వుంటుందంబరు.
2021- 22 నుంచి అందుబాటులోకి రానున్న ప్రభుత్వ బిసి స్టడీ సర్కిల్,
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో బాలురు,  బాలికలకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం ఉందన్నారు.
'యువతరంగం' కార్యక్రమం ద్వారా విద్యార్థులలో గల సాంస్కృతిక, క్రీడా నైపుణ్యాల వెలికితీత కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీల నిర్వహణ,విశాలమైన ప్రాంగణం, ఆటస్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం, రాశివనం, ఓపెన్ జిమ్ లతో విశిష్ట గుర్తింపు పొందిన కళాశాల అని అన్నారు. ఇంతటి విశిష్టత, కామారెడ్డి ప్రాంతంలోని మూడు తరాలను తీర్చిదిద్దిన చారిత్రక ప్రాధాన్యత గల ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామారెడ్డిలో చేరుటకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను డిగ్రీ కోర్సుల్లో చేరవలసిందిగా కోరుతున్నాం అని అన్నారు.
 

Related Posts