YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ

చిన్నారులతో కలిసి క్రికెట్ సరదా తీర్చుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మూడు బంతుల్లో రెండు సిక్సర్ లు కొట్టి క్రింద స్ఫూర్తిని చాటారు

చిన్నారులతో కలిసి క్రికెట్ సరదా తీర్చుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మూడు బంతుల్లో రెండు సిక్సర్ లు కొట్టి క్రింద స్ఫూర్తిని చాటారు

చిన్నారులతో కలిసి క్రికెట్ సరదా తీర్చుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
మూడు బంతుల్లో రెండు సిక్సర్ లు కొట్టి క్రింద స్ఫూర్తిని చాటారు
 కామారెడ్డి జూలై 09
గత  వారం రోజులుగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో భాగంగా బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతికి ఒక్కసారిగా క్రికెట్ అడలనిపించిందో ఏమో, ఇంకేముంది, చిన్నారులతో కల్సి శుక్రవారం స్పీకర్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆట మొదలెట్టారు.  చిన్నారులతో కలిసి క్రికెట్ చాన్నాళ్లకు తన క్రికెట్ సరదా తీర్చుకున్నారు.
తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడ కు వస్తున్న స్పీకర్ కు  మద్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. తన కారు ఆపి క్రికెట్ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లి తాను కూడా క్రికెట్ అడతానంటూ  స్పీకర్ పిల్లలను పలకరించారు.  పిల్లతో తను ముందుగా బ్యాటింగ్ చేస్తానంటూ బ్యాట్ పట్టుకొని  కాసేపు క్రికెట్ ఆడారు.బ్యాటింగ్ చేసిన స్పీకర్ పోచారం మూడు బంతులను ఎదుర్కొని అందులో రెండు సిక్స్ లు కొట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచిందింది. ఆ వయస్సులో కూడా బ్యాటింగ్ చేయడం అనేది గొప్ప విషయమే, పాలన పరంగానే కాకుండా ఇంకా తనలో ఇంకా  క్రీడ స్ఫూర్తి ఉందని నిరూపించారు స్పీకర్. ఈ మధ్య కాలంలో స్పీకర్ అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

Related Posts