YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి కేటీఆర్ కు జ్ణానం లేదు రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ కు జ్ణానం లేదు రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ కు జ్ణానం లేదు
రేవంత్ రెడ్డి
హైదరాబాద్
మంత్రి కేటీఆర్ కు జ్ణానం లేదు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన తోపు కాదు. నేను పార్టీ కి  రాజీనామా చేసి విజయవాడలో మా అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇచ్చా. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసా. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ...వెంటనే ని ఎమ్మెల్యే జీత భత్యాల ఏకౌంట్ ను క్లోజ్ చేసానని ఎంపీ, టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు.  నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంది. నేను చంద్రబాబు దగ్గర సహాచరుడిగా పనిచేసా..కేసీఆర్ చంద్రబాబు దగ్గర బానిసలా పనిచేసాడు. నాది తెలుగు దేశం కాంగ్రెస్ అయితే.. కేసీఆర్ ది తెలుగు దేశం టిఆర్ఎస్ పార్టీ నా. టిఆర్ఎస్ లో ఉన్న టాప్ లీడర్లు అంతా తెలుగు దేశం వారే. ఇప్పటి నుంచి కేటీఆర్ అని పిలవను ..డ్రామా రావు అని పిలుస్తా. కేటీఆర్ అని పిలుస్తే..ఎన్టీఆర్ పరువుతీసిన వాల్లం అవుతాం. కేసీఆర్ జీవితం , జీవనం మొత్తం తెలుగుదేశమే కదా . హరీష్ రావు ని మంత్రి ని చేసింది కాంగ్రెస్ కదా. కేసీఆర్, కేటీఆర్ ల కు తెలుగు దేశం బిక్ష వేస్తే...హరీష్ రావు కు కాంగ్రెస్ బిక్ష పెట్టింది. మంత్రుల లో 75 శాతం తెలుగు దేశం పార్టీ వాల్లే కదా. మళ్ళీ గతిలేక ఈరోజు ఎల్ రమణ ను కూడా చేర్చుకుంటుంన్నారు. నక్క పూలితోలు కప్పుకున్నట్లు తెలుగు దేశమోళ్ళు మొత్తం టిఆర్ఎస్ లో ఉన్నారు. కేటీఆర్ ముందు ఆంధ్ర వాళ్ళపేరు మార్చుకుంటే మంచిదని అన్నారు.

Related Posts