YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రమణ హామీ... ఏంటీ

రమణ హామీ... ఏంటీ

రమణ హామీ... ఏంటీ
కరీంనగర్, జూలై 10,
లంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇక నిన్న సీఎం కేసీఆర్ ను కలిసిన రమణ త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లోకి చేరడం దాదాపు ఖరారు కావడంతో ఆయనకు పార్టీలో ఎలాంటి స్థానం దక్కుతుందనే అంశంపై చర్చ నడుస్తుంది. అయితే ప్రధానంగా రెండు ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి . త్వరలోనే జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎల్.రమణను బరిలోకి దింపే యోచనలో టీఆర్‌ఎస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే రమణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతారు. ఒక వేళ ఓటమి పాలైతే… త్వరలో ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్యేల కోటా, ఒక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని రమణకు ఇచ్చి మండలికి పంపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎల్. రమణ కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సామాజిక వర్గం కావడం కూడా ఆయనకు కలిసొచ్చే ఆంశంగా అందరూ భావిస్తున్నారు. ఇటీవల హుజురాబాద్ నేత కులస్తులను సర్వే చేసిన టీం షాకింగ్ విషయాలు చెప్పిందట. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చేనేత కులస్తులందరూ ఈటల రాజేందర్ వైపే ఉన్నారని, వారంతా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర కోపంతో ఉన్నారని ఆ సర్వే బృందం తెలియజేసిందని ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో చేనేత కులస్తులవి దాదాపు 30 వేల ఓట్ల వరకు ఉంటాయి. ఎల్. రమణ కూడా చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో అతడిని బరిలో నిలపడం ద్వారా ఆ సామాజిక వర్గం వారిని ప్రసన్నం చేసుకునేందుకు వీలుంటుందని గులాబీ నేతలు భావిస్తున్నారట. ఇలా ఎలా చూసినా… ఎల్. రమణ చేరిక టీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. అంతే కాకుండా ఈటల రాజేందర్ కు బీజేపీ దూకుడు కు కళ్లెం వేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
శని విరిగిపోయింది
మరో వైపు టిడిపిపార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎల్. రమణ చేరడంపై టిటిడిపి స్పందించింది. టిటిడిపి ఇంచార్జ్ నాయుడు దీనిపై మాట్లాడుతూ.. టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్. రమణకు టపాకాయలు కాల్చుతూ మా పార్టీ నేతలు వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎల్. రమణను కాకుండా.. ఐరన్ లెగ్ రమణను కేసీఆర్ తన..పార్టీలో చేర్చుకున్నాడని ఎద్దేవా చేశారు.ఏడేళ్లుగా టిడిపికి పట్టిన శని నేటితో వదిలిపోయిందన్నారు. రమణ వెళ్లిపోయినందుకు టిడిపి శ్రేణులు ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నూతన నాయకత్వంలో భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని.. రమణ వెళ్లిపోవడం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి శుభసూచకమని స్పష్టం చేశారు. కాగా  కాగా టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మరో రెండు లేదా మూడు రోజుల్లో అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లో చేరుతానని వెల్లడించారు ఎల్ రమణ.

Related Posts