YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాకూ ఓ వ్యూహకర్త

మాకూ ఓ వ్యూహకర్త

రాజకీయ వ్యూహకర్తలను నియమించుకున్న పార్టీల లిస్ట్ లో జనసేన కూడా చేరింది. ఈ ఫీల్డ్ లో పదేళ్ల అనుభవం ఉన్న స్ట్రాటజిస్ట్ దేవ్ ను రిక్రూట్ చేసుకుంది. దేవ్ రాకతో.. తమ పార్టీ అద్భుతాలు చేయడం ఖాయమని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే చిన్నాచితకా పార్టీలతో పాటూ మేజర్ పార్టీలూ పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఏర్పాటుచేసుకున్నాయి. తమపార్టీకి ఎన్నికల్లో విజయం కట్టబెట్టే ఫార్ములాలు, ప్లాన్ల రూపకల్పనలో వీరు తలమునకలై ఉన్నారు. ఇదిలాఉంటే.. వ్యూహకర్తలను నియమించుకున్న పార్టీల సరసన జనసేన కూడా చేరింది. రాజకీయ వ్యూహకర్తగా దేవ్ కు పదేళ్ల అనుభవం ఉంది. దేశీయంగానే కాక విదేశాల్లోనూ ఆయన స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. ఈ అనుభవం తమ పార్టీకి కలిసివస్తుందని జనసేన విశ్వసిస్తోంది. ఇటు దేవ్ సైతం అదే జోష్ తో ఉన్నారు. పవన్ కల్యాణ్ కు ప్రజాసమస్యలపై స్పష్టత ఉందన్న ఆయన.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచే జనసేనను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు.

 

పవన్ కల్యాణ్.. తమ ఫ్యూచర్ ప్లాన్ నూ వివరించారు. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ జనసేన పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. మొత్తం 175 స్థానాల్లోనూ తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. తెలంగాణలో పోటీకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో ప్రకటన చేస్తానని పవన్‌ చెప్పారు. కులాల ఐక్యత తమ ప్రధాన సిద్ధాంతమని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను దానికి తెలియపరిచేలా ప్రజల మధ్యలోకి వెళదామని పవన్‌ ప్రకటించారు. ఈ నెల 11వ తేదీలోగా ఈ పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. షెడ్యూల్‌ ప్రకటించిన 2 రోజుల్లోనే ప్రజల మధ్యలో ఉంటానని స్పష్టం చేశారు. శాసనసభ్యునిగా పోటీ చేసేముందు క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ విధానాల్లో రాజకీయాలు చేసేవారికి జనసేన వైఖరి అర్థం కాదని అన్నారు. పొలిటికల్ రేస్ లో జనసేననూ క్రూషియల్ చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజలను తమవైపు తిప్పుకునేలా పార్టీ వ్యూహాలు ఉండాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త దేవ్ ను నియమించుకున్నారు.

Related Posts