YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని నిలిపివేసిన అధికారులు

నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని నిలిపివేసిన అధికారులు

నల్లగొండ జూలై 10
జిల్లాలోని నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని అధికారులు నిలిపివేశారు. జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాలతో కరెంటు ఉత్పత్తిని ఆపివేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తంగా 11 రోజుల్లో 30 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు నిలిచిపోయింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 529.20 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు. ఇప్పుడు 166.5892 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా, ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. 18,246 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.

Related Posts