YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వసూల్ రాజాల గుండెల్లో ఏసీబీ గుబులు

వసూల్ రాజాల గుండెల్లో ఏసీబీ గుబులు

ప్రభుత్వ, అధికార యంత్రాంగాల్లోని అవినీతి ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ మాటను ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రజాసేవే పరమాధిగా పనిచేసి.. అక్రమాలు, అవినీతికి దూరంగా ఉండాలని, నేతలు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి తేల్చిచెప్పారు. అయినప్పటికీ కొందరి తీరులో మార్పు ఉండడంలేదు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ దందా జోరుగా సాగిపోతోంది. భద్రాచలం లోని ఐటీడీఏ విభాగంలో ఈ తంతు ఉధృతంగా ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పలువురు ఇష్టారాజ్యంగా ముడుపులు తీసుకుంటున్నట్ల సమాచారం. ఇక ఇటీవలిగా ఏసీబీ సైతం ఈ తరహా వసూల్ రాజాలను షాక్ ఇస్తోంది. వల వేసి పట్టుకుంటోంది. దీంతో మిగతా అక్రమార్కులు సైతం కొంత జంకుతున్నారు. అయితే నాణేనికి మరో పార్శ్వంలా మరికొందరు తమ దందా యథేచ్ఛగా సాగించేస్తున్నారని టాక్. ఏదేమైనా భద్రాచలంలోని ఐటీడీఏలో అవినీతి దందా విస్తరించిందని స్థానికులు వాపోతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగానికి జిల్లా అధికారిగా ఉన్న ఈఈ శంకర్‌తోపాటు ఏఈ సత్యనారాయణ రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కారు. దీంతో స్థానికంగా ఈ ఉదంతం కలకలం సృష్టించింది. 

Related Posts