అమరావతి జూలై 10
ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులలో అమరుడైన జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి మృతి పట్ల హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రగాడ సంతాపం తెలిపారు. జశ్వంత్‌రెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని దత్తాత్రేయ ఫోన్లో పరామర్శించారు.మరోవైపు స్వగ్రామంలో వీరజవాన్ జస్వంత్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సైనికులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. జస్వంత్ రెడ్డి మృతదేహానికి తండ్రి శ్రీనివాసరెడ్డి చితి ముట్టించారు. 2016లో ఆర్మీలో జవానుగా చేరిన జస్వంత్ రెడ్డి జమ్మూకశ్మీర్ వద్ద ముష్కరుల కాల్పుల్లో బలయ్యాడు. మరో నెలరోజుల్లో సెలవులపై ఇంటికి వస్తాడనే ఆశతో తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మలు ఎదురుచూస్తుండగా మరణ వార్త అందింది. దీంతో జస్వంత్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.