YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పదహారు నుంచి ఆరుకు తగ్గిన సినిమా ధియేటర్లు

పదహారు నుంచి ఆరుకు తగ్గిన సినిమా ధియేటర్లు

నిమా థియేటర్లకు ఆ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా ఆర్టీసీ క్రాస్‌రోడ్ ఉండేది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా అక్కడ రిలీజ్ కావాల్సిందే. ఎందుకంటే ఒకే చోట 16 థియేటర్లు ఉంటాయి మరి. సి చెప్పుకుంటారు. ఎప్పుడు చూసినా అభిమానుల కోలాహలంతో భారీ కటౌట్లతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణంలా ఉంటోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్ అంటే సినిమా థియేటర్లు, కొత్త కొత్త సినిమాలతో, తమ అభిమాన హీరోల బ్యానర్‌లు, ఫ్లెక్సీలతో కళకళలాడేది. లక్షలాది మందికి వినోదాన్ని పంచింది. కానీ ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ రూపురేఖలు మారిపోతున్నాయి. కొత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ఇప్పుడు బోసిపోతోంది. ఇంతకు ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనబడట్లేదు.  ఆర్టీసీ క్రాస్ రోడ్డు సినిమా అభిమానులతో కిటకిటలాడేది. తమ అభిమాన హీరోల సినిమా పండగ వాతావరణం ఎంతో కోలాహాలంగా ఉండేది. డప్పు చప్పుళ్లు, టపాసుల మోత కనబడేది. రంగురంగు కాగితాలు, బ్యానర్లతో అభిమానులు థియేటర్లకు అలంకరించేవారు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగ వచ్చిందంటే క్రాస్‌రోడ్డులో సినిమా చూడటానికి ఇష్టపడేవారు. ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికే సినిమా అభిమానులు వచ్చి సినిమా చూసి వెళ్లేవారు. ఒకవేళ టిక్కెట్లు దొరక్కపోతే రాత్రి బసచేసి మరుసటి రోజు సినిమా చూసి ఊళ్లకు పయనమయ్యేవారు. క్రాస్‌రోడ్డులో ప్రధానమైన థియేటర్లు సంగం, సుదర్శన్70ఎంఎం, సుదర్శన్ 35ఎంఎం, సుభాష్, శాంతి, తారకరామ, దేవి, సంధ్య 35ఎంఎం, సంధ్య 70ఎంఎం, సప్తగిరి, శ్రీమయూరి, రాజాడీలక్స్, ఓడియన్ డీలక్స్, ఓడియన్ 70ఎంఎం, పరమేశ్వరీ, మహేశ్వరీ ఉండేవి. ఇప్పుడు ఇందులో ఓడియన్ 70 ఎంఎం, ఓడియన్ డీలక్స్, సుదర్శన్ 70ఎంఎం, సంగం, సుభాష్, పరమేశ్వరీ, మహేశ్వరీ థియేటర్లు కనుమరుగయ్యాయి. వాటి స్థానాల్లో బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు వెలిశాయి.ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే సినీ అభిమానులు అంతా క్రాస్ రోడ్డులోని థియేటర్లకు వచ్చి సినిమా చూసి వెళ్లేవారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమాలకు… ఇలాంటి కొన్ని వేల సినిమాలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్ కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో నాలుగు థియేటర్లు ఉన్నట్లు ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో పక్కపక్కనే 16 సినిమాహాళ్లు ఉండేవి.కుప్పలు తెప్పలుగా వచ్చిన సినీ మల్టీప్లెక్స్‌లు నగర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఒకే థియేటర్లలో నాలుగేసి స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్రాస్ రోడ్డు వరకు వచ్చి సినిమా చూడటానికి జనం ఇష్టపడట్లేదు. ఒకప్పుడు రూ.100 పెడితే కుటుంబం అంతా సినిమా చూసి, ఇంట్రవెల్‌లో తినుబండారాలు కూడా కొనుక్కొని తినేవారు. ఇప్పుడు వంద రూపాయలకు ఒక్కరికి కూడా టిక్కెట్ రావడంలేదని సగటు ప్రేక్షకుడు ఆరోపిస్తున్నారు.

వినోదం అందరికి అందుబాటులో ఉండాలి. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సినిమా థియేటర్లు మూసపద్ధతిలో ఉండటంతో కొత్త పరిజ్ఞానాన్ని వినియోగించుకోకపోవడంతో కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఈ సినిమా థియేటర్లను మలుచుకోకపోవడంతో కుప్పలు తెప్పలుగా నగరంలో ఎక్కడికక్కడే మల్టీపెక్స్‌లు పుట్టుకొచ్చాయి. ఐనాక్స్, ప్రసాద్ ఐమాక్స్, పివిఎస్ సినిమా ఇలా కొత్త కొత్త మల్టిప్లెక్స్ సినిమా థియేటర్లు అన్నికూడా చిన్నచిన్న వ్యాపారుల చేతిలోనే కాదు బడాబాబుల షేర్లు వీటిలో ఉన్నాయి. వీటితోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు ఎసరొచ్చిందంటున్నారు సినీ అభిమానులు. మల్టీప్లెక్స్‌లు నగరంలో పెరుగడంతో చిన్న థియేటర్లు కుదేలవుతూ వస్తున్నాయి. సగటు ప్రేక్షకుడికి వినోదం ఇప్పుడు చాలా ఖరీదుగా మారింది. దీంతో మద్యతరగతికి సినిమా వినోదం అందుబాటులోకి లేకుండా పోతోంది. ఒకప్పుడు సినిమాలతో హవా నడిపించిన ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకి పూర్వవైభవం వస్తుందా..లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సినిమా రిలీజ్ నాడు అంతా బ్లాక్‌లోనే టిక్కెట్లు అమ్మేస్తున్నారు. రూ.500 నుంచి రూ.1000 వరకు బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. మరోపక్క సినిమారిలీజైన రెండు రోజులకే సిడీలు లభిస్తున్నాయి. దీంతో సినిమాలకు ఆదరణ కరువై థియేటర్లు మూతపడిన పరిస్థితులు నెలకొనేవి. నగరవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా థియేటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతంలో ఉండే థియేటర్లలోనే సినిమాను చూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది.హైదరాబాద్‌కు వచ్చిన సినిమా ప్రేమికులు ఇక్కడ సినిమా చూశాకే వెళ్లేవారు. రంగు రంగు కాగితాలతో, భారీ కటౌట్లతో, టపాసుల మోతతో సినిమా రిలీజు అయిందంటే పండగ వాతావరణం ఉండేది. ఏ సినిమా రిలీజైనా దీపావళి పండగలా ఉండేది. ఇక్కడ ఉన్న ఒక్కోక్క థియేటర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆర్టీసి క్రాస్ రోడ్ కేవలం ఒక్క సినిమాలకు మాత్రమే ఫేమస్ కాదు. షాపింగ్‌కు, బిర్యానీకి కూడా ఫేమస్. అదంతా గతం ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు రూపు రేఖలు మారిపోతున్నాయి. నగరశివార్లలోనే పెద్ద ఎత్తున మల్టీప్లెక్స్‌లు ఏర్పాటుకావడం భారీ షాపింగ్‌మాల్స్ రావడంతో క్రాస్‌రోడ్డుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొత్త సినిమా రిలీజ్ అయితే గతంలో కనబడే టపాసు మోతలు, బ్యాండ్ చప్పుళ్లు, బ్యానర్లు కనమరుగవుతున్నాయి. ఒకప్పుడు ఉండే 16 థియేటర్లలో కొన్ని సినిమా హాళ్లు మూతపడ్డాయి. వాటి స్థానంలో బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్లు, హోటళ్లు వెలిశాయి.మరికొన్ని మల్టిప్లెక్ రూపాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంతో ఫేమస్ టాకీస్‌లుగా పేరు తెచ్చుకున్న సుదర్శన్ 70ఎంఎం, ఓడియన్ డీలక్స్, ఓడియన్ 70ఎంఎం, మహేశ్వరీ, పరమేశ్వరీ, రాజాడీలక్స్ ఇప్పుడు కనుమరుగై పోయాయి. మరికొన్ని రూపాన్ని మార్చుకుంటున్నాయి. సినిమాలు, సినిమాల్లో వినోదం మారుతున్నట్లే పరిస్థితులు మారాయి. థియేటర్లల్లో సినిమా చూడటానికి సినిమా హాళ్లకు రావడానికి తగ్గించారు ప్రజలు. సినిమా అయిన రెండు రోజులకే పైరసీ సీడీలు వచ్చేస్తున్నాయి. రూ.50 పెట్టి వాటిని కొనుగోలు చేసి ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. కొత్త కొత్త మొబైల్ యాప్‌లతో ఏకంగా ఫోన్లలోనే సినిమాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఒకవేళ సినిమాకు వచ్చినా యువకులే ఎక్కువగా వచ్చేస్తున్నారు. టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడంతో సినిమా చూసే పరిస్థితి లేదంటున్నారు సినిమా అభిమానులు. ఇక సినిమా విచ్చిన వారం రోజులు దాకా అంతా బ్లాక్‌లోనే టిక్కెట్లను అమ్ముతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడంలేదని చెప్తున్నారు. మారినా పరిస్థితుల దృష్టా సినిమా హాళ్లల్లో సౌకర్యాలు పెరిగాయి. వాటితోపాటే బ్రేక్‌లో విక్రయించే తినుబండారాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. చిన్న థియేటర్లలో వంద రూపాయలతో కుటుంబం మొత్తం సినిమా చూసే వారు. వంద రూపాయలతో సరిపెట్టుకునే సగటు ప్రేక్షకుడు ఇప్పుడు వేల రూపాయలు తీసుకుపోయినా డబ్బులు సరిపోని పరిస్థితి.

Related Posts