సైబర్ క్రైం పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 10,
షల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోలు, డైలాగ్స్ వైరల్ అవుతుంటాయి. ప్రముఖ నటుల డైలాగ్స్ వాడడం ఎప్పటినుంచో మొదలైంది. మొదట్లో ఇది బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త తలనొప్పులు తెస్తున్నది. తమ సంబంధీకుల పైనే డైలాగ్ లను వాడడంతో లేని సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు మెహన్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సోషల్ మీడియాలో తన వీడియోస్ కి వ్యక్తిగత దూషణలు చేయడమే కాకుండా అసభ్యకరమైన బూతులు, కామెంట్ల రూపంలో వీడియో రూపంలో పోస్టులు చేస్తున్నారంటూ ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ సైబర్ క్రైమ్ పోలీసుల ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్‌లో మోహన్‌బాబును కొందరు టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.పొలిటికల్ మోజో అనే పేరు గల యూట్యూబ్ ఛానెల్ మోహన్ బాబును వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా.. బూతులు తిడుతూ వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారంటూ ఆయన అడ్వైజర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.