YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో టెన్త్ మార్కులు కేటాయింపులకు

ఏపీలో టెన్త్ మార్కులు కేటాయింపులకు

ఏపీలో టెన్త్ మార్కులు కేటాయింపులకు
విజయవాడ, జూలై 10,
కరోనా వ్యాప్తి కారణంగా ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు సంబంధించి మార్కుల కేటాయింపు విధానాన్ని ప్రభుత్వం నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. వీరికి పదో తరగతి మార్కులకు 30శాతం వెయిటేజీ.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే.అలాగే.. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఫార్మేటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చినట్లు సమాచారం. పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మేటివ్ పరీక్షలను నిర్వహించారు.అయితే ఫార్మెటివ్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు. ఇలానే ఫార్మెటివ్ 2కు సైతం చేస్తారు. ఉదాహరణకు 50 మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్ – 1 పరీక్షలో ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35, ఫార్మెటివ్ – 2 పరీక్షలో 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ మార్కుల ఆధారంగా ఆ విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, మొత్తం గ్రేడ్ ఇవ్వనున్నారు.అయితే ఇంటర్నల్ మార్కుల విధానం అమలులోకి రావడానికి సర్కార్ జీఓ జారీ చేయాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
31లోపు ఇంటర్ ఫలితాలు
పీలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఏపీ ప్రభుత్వం మాత్రం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ.. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.జులై 31లోపు పరీక్షా ఫలితాలను ప్రకటించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు.. అంతలోపు పరీక్షలను నిర్వహించి, ఫలితాలను విడుదల చేయడం అసాధ్యమని భావించిన ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ఏ ప్రతిపాదికన ఇవ్వనున్నారన్న దానిపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పదో తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని 12వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. థియరీ పేపర్‌ మార్కుల కోసం.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్‌, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఇంటర్మిడియట్‌ బోర్డు అధికారికంగా తెలిపింది.ఇక జులై 31లోపు ఫలితాలను ప్రకటించాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ఇంటర్మిడియట్‌ బోర్డ్‌ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పరీక్షా ఫలితాలను ఏ ప్రాతిపాదికన విడుదల చేయాలన్నదానిపై ప్రభుత్వం హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ ఫలితాల కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే.. కొత్త అకడమిక్‌ ఆన్‌లైన్‌ తరగతులను జులై 12 నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆఫ్‌లైన్‌ తరగతులను ఆగస్టు 16 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Posts