YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

ప్రజల సహకారంతోనే అభివృద్ధి

కరీంగనగర్, జూలై 10, 
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా భాగ‌స్వామ్య‌మై, పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సూచించారు. క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ మండ‌లం ఇరుకుళ్ల గ్రామంలో చేప‌ట్టిన ప‌ల్లెప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మంత్రి గంగుల పాల్గొని మొక్క‌లు నాటారు. మ‌హిళా సంఘ భ‌వ‌నం, గౌడ సంఘ భ‌వ‌నాల‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. ప‌ల్లెప్ర‌గ‌తితో గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయ‌ని పేర్కొన్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంతో ప‌ల్లెల‌న్నీ ప‌చ్చ‌గా క‌ళ‌క‌ళలాడుతున్నాయ‌ని తెలిపారు. మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా వాటిని సంర‌క్షించాల‌ని బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను రైతుల‌కు అందిస్తున్నామ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం నీళ్ల‌తో రైతులు పంట‌లు పండించుకుంటున్నారు. రైతు పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డ‌మే కాకుండా.. చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేశామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ చైర్మన్ కనమల్ల విజయ, జ‌డ్పీటీసీ పురమల్ల లలిత, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సర్పంచ్ బలుసుల శారద ,ఉపసర్పంచ్ ముత్యం శంకర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఎండీ సర్వర్ , జువ్వాడి రాజేశ్వరరావు, బుర్ర రమేష్ ,సుంకిశాల సంపత్ రావు, ప్యాక్స్ చైర్మన్లు బల్మురి ఆనందరావు, పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు

Related Posts