YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రవర్తన, పరివర్తన

ప్రవర్తన, పరివర్తన

ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.

ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే,  దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది, కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తుంది.. అనిచెప్పటంలో తిరుగు లేదు. ఎంత ధ్యానం చేసినా, యోగా, వ్యాయామం.. చేసినా దానిని సరిచేయలేవు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం. నేడు చాలామంది తనలోనిమంచిని వదిలేసి ఎదుటివారిలో చెడుని చూస్తున్నారు-చూపిస్తున్నారు.  తామే నీతి మంతులము, సచ్చీలురము .. ఎదుటివారు అందరూ సత్ప్రవర్తన లేనివారే అని భ్రమ పడుతుంటారు, కానీ వారే సమాజానికి ఉపయోగం లేనివారు . దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.

దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. వీరు కూడా అంతే...

చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకం లో  అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే...మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు._మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.  మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి. అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి చెడు ను మీరు అనుభవించకండి... ఎవరూ దుర్మార్గులుకాదు, పాపాత్ములుకాదు ప్రతివారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు *దీనివల్ల అలాంటివారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేకరకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.* జీవితాలు, ఆరోగ్యం, మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు.. విరోధులు పెంచుకుంటున్నారు, బావిలో కప్పలు లాగా జీవిస్తున్నారు... దయచేసి అంతా క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచిగురించిమాత్రమే చెబుదాం!

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts