YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంబటి, ప్రసన్నలకు ఛాన్స్

అంబటి, ప్రసన్నలకు ఛాన్స్

గుంటూరు, జూలై 12, 
మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. జగన్ అన్ని విధాలుగా చూసుకుని తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకోనున్నారు. ఎన్నికలకు ఇదే కేబినెట్ తో వెళ్లనుండటంతో ప్రతి సున్నితమైన అంశాన్ని జగన్ పరిశీలించనున్నారు. అయితే వైసీపీలో ఇద్దరు నేతల గురించి హాట్ హాట్ చర్చ జరుగుతుంది. నోరు జారి అందివచ్చిన పదవిని వీరిద్దరూ పోగొట్టుకున్నారా? అన్న అనుమానాలను సీనియర్ నేతలు సయితం వ్యక్తం చేస్తుండటం విశేషం.వైసీపీలో సీనియర్ నేతలు అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అంబటి రాంబాబు పార్టీకి గట్టి గొంతుకగా నిలుస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ స్టాండ్ ను చెప్పడంలోనూ, వైరి పక్షాన్ని విమర్శించడంలోనూ అంబటి రాంబాబు దిట్ట. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డారు. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. తన సామాజికవర్గమైన కాపులపైనే ఆయన వ్యాఖ్యలు చేశారు.కాపు సామాజికవర్గం ఇప్పటికే వైసీపీకి దూరమయ్యేట్లు ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు కాపులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాపు సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమయింది. దీంతో అంబటి రాంబాబు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. అయినా ఇది అంబటి రాంబాబుకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే విషయమే. ఈ అంశం ఆధారంగా జగన్ తన కేబినెట్ లోకి ఈసారి కూడా తీసుకునే అవకాశం లేదంటున్నారు.ఇక కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీకి విజయమ్మతో పాటు తొలి ఎమ్మెల్యే. అలాంటి సీినియర్ నేతకు జగన్ ఈసారి తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న అంచనా ఉంది. అయితే ఆయన కూడా నోటి దూలతో మంత్రిపదవిని దూరం చేసుకున్నారనిపిస్తోంది. జగనన్న పక్కా ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని ఆయన చేసిన వ్యాఖ్యలపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మొత్తం మీద ఈ ఇద్దరు నేతలు నోటి దురుసుతో నోటి దాకా వచ్చిన పదవిని పోగొట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి ఈ ఇద్దరి విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందో?

Related Posts