- ముఖ్యమంత్రి నీటి మీద రాతలు రాయడంలో దిట్ట.
- బహిరంగ చర్చకు నేను సిద్ధం.
విద్యుత్ విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలి.
ప్రజలకు అవసరం లేకపోయినా తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పనిచేయడంలో కేసీఆర్ దిట్ట అని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడారు. అనుమతులు లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులపై కేసులు పెట్టిందన్నారు
సూపర్ క్రిటికల్ టెక్నాలజీ జి మార్చమని కేంద్రం అదేశిస్తే...ఇండియాబుల్స్ సంస్థ కేసీఆర్ను ప్రసన్నం చేసుకొ0దని ఆరోపించారు ,కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఔట్ డేటెడ్ టెక్నాలజీ .అందుకే బి హెచ్ ఈ ఎల్ ఇండియా బుల్స్ కి 2000 కోట్లు చెల్లించిందని అన్నారు.ఇండియా బుల్స్ కి చెల్లింపులో కేసీఆర్ చీకటి ఒప్పందం ఉంది.సివిల్ కాంట్రాక్టర్ ని ప్రభుత్వమే దొడ్డిదారిన కేటాయించిందని అన్నారు.ఇండియాబుల్స్ ని కాపాడే అవసరం ఈ.ప్రభుత్వానికి ఏముంది.ఇలాంటి తప్పుడు నిర్ణయాలవల్ల 12000కోట్ల భారం ప్రజలపై పడనుందని ఆందోళన వ్యక్తం చేసారు .సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుండి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారందని కేంద్రం చెప్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటిందని ప్రశ్నించారు .
విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ.. యోగదారులు తక్కువ
కేంద్ర ఉద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పై పునరాలోచించాలి అని చెప్పారు.ఇండియా బుల్స్ ని కాపాడేందుకు కేసీఆర్ ప్రజలపై 7000 వేల కోట్ల భారం మోపాడు.నిరంతర విద్యుత్ కేసీఆర్ వల్ల వచ్చింది కాదు. దేశంలోని కొన్ని సరళీకృత.నిర్ణయాల వల్ల వచ్చింది.జగదీశ్వర్ రెడ్డి ఒక చేత కానీ మంత్రి,చవట, దద్దమ్మ,ఒక చెమ్చా. అన్ని అబద్ధాలే చెప్తాడు.సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని 13 వ పంచవర్ష ప్రణాళిక నిషేధించింది.కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయంలో చర్చకు సిద్దమన్నారు. విద్యుత్ సంస్థల్లో తక్కువ స్థాయి,వ్యక్తులను ఉన్నత స్థానంలో కూర్చోబెడుతున్నారు.తెలంగాన ప్రభుత్వం విద్యుత్ విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలి. మూడేళ్లలో 21వేల మెగావాట్లు ఉత్పత్తి సామర్ధ్యం తెస్తామని సీఎం చెప్పారు.2014 నవంబర్ 10న అసెంబ్లీలో సీఎం చేసిన ఈ ప్రకటనపై ఆ రోజే నేను స్పందించా.15 వేల మెగావాట్లు తెచ్చినా సన్మానం చేస్తానని చెప్పా.
యాదాద్రి, భద్రాద్రి ఎక్కడవేసిన గొంగళి అక్కడే .
భద్రాద్రి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక బీహెచ్ఈఎల్ కు ఇచ్చామన్నారు.అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినందుకు 23 మంది అధికారుల పై ఎన్జీటీ క్రిమినల్ కేసులు పెట్టిందన్నారు.ఇండియాబుల్స్ సంస్థకు మేలు చేసేందుకు నిషేధిక టెక్నాలజీతో తయారు చేసిన బాయిలర్లు కొన్నారు.రాష్ట్రం వచ్చాక ఇండియాబుల్స్ వాళ్లు కేసీఆర్ ను కలిసి ప్రసన్నం చేసుకున్నారు.దీంతో ఇండియాబుల్స్ లబ్ధిజరిగేలా బీహెచ్ఇఎల్ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఇండియాబుల్స్ సంస్థను కాపాడటం కోసం తెలంగాణ జెన్ కోను బలిచ్చారు.ఎప్పుడు సివిల్ వర్కులు చేయని బీహెచ్ఇల్ఎల్ కు భద్రాద్రిలో సివిల్ వర్క్ ఇచ్చారు.బీహెచ్ఇఎల్ ద్వారా దొడ్డిదారిన తమకు కావాల్సిన వారికి పనులిచ్చారు.కేంద్రం నిషేధం విధించిన టెక్నాలజీని కొనాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అప్పుచేయబోతున్నారు.ఐఏఎస్ లను పక్కనపెట్టి ఎందుకు రిటైర్ అయ్యిన అధికారులను ఉన్నత పదవుల్లో నియమించారు దీనివెనుకఉన్న మతలబు ఏంటో చెప్పాలి .. తన పనులు చక్కబెట్టుకునేందుకే కేసీఆర్ తన అన్యుయాయులను పదవుల్లో పెట్టుకున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు బయటకొచ్చేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి అఖిల పక్షం పిలవాలిదీనిపై విద్యుత్ మంత్రి .. అధికారులు ఎవరొచ్చినా బహిరంగ చర్చకు నేను సిద్ధ మని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.