YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

కోళ్ల ఫారాలకు ఎండ కష్టాలు

కోళ్ల ఫారాలకు ఎండ కష్టాలు

వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి పోతుండటంతో పగటిపూట కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. వ్యవసాయ అనుబంధంగా పాడితోపాటు కోళ్లఫారాల పరిశ్రమ జిల్లా రైతాంగానికి ఉపాధినిస్తోంది. హైదరాబాద్‌ జిల్లా ఆనుకుని ఉండటంతో ఉండటంతో ఈ పరిశ్రమ వర్గాల వారికి అనుకూలంగా ఉంది. అయితే ఎండవేడిమి కారణంగా కోళ్లఫారాల నిర్వాహకులకు విపత్తు వచ్చిపడింది. 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా బ్రాయిలర్‌ కోళ్లు తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ప్రస్తుతం 40నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. భూగర్భజల మట్టం తగ్గడంతో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఫారాల నిర్వహణకు నీటి ట్యాంకర్లను వినియోగిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. వీటి ఏర్పాటులో రైతులకు నిర్వహణ ఖర్చు మరింత పెరిగింది. పౌల్ట్రీల వద్ద ఏర్పాటు చేసుకున్న ట్యాంకుల్లో నీటిని నిల్వచేసుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడానికి షెడ్ల పైకప్పుపై మధ్యాహ్నం వేళల్లో నీటిని చల్లిస్తున్నా వాటిని బతికించుకోవడం కష్టమవుతుందని యజమానులంటున్నారు. ఒక్కోషెడ్‌లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో నష్టపోతున్నామంటున్నారు.ఉష్ణోగ్రతలు పెరిగి పోతుండటంతో నిత్యం వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. కరవులో ప్రత్యామ్నాయంగా ఉపాధి లభిస్తుందని భావించిన వారికి నష్టాలు మిగులుతున్నాయి.జిల్లాలో బొమ్మలరామారం, రాజపేట, ఆలేరు, బీబీనగర్‌, చౌటుప్పల్‌, తుర్కపలి,్ల తదితర ప్రాంతాల్లో కోళ్లఫారాలు ఎక్కువగా ఉన్నాయి. బ్రాయిలర్‌, లేయర్‌ కలిసి సుమారు 700పైగానే ఉన్నాయని సమాచారం.  ఆర్థికంగా కలిగినవారు సొంతంగా ఫారాల నిర్వహణ చేపడుతుండగా, మరికొందరు అద్దె రూపంలో, ఇంకొందరు ఆయా కంపెనీల ఒప్పంద పద్ధతిన ఫారాల నిర్వహణ చేపడుతున్నారు. కరవు కారణంగా వ్యవసాయం సాగు అంతగా అనుకూలంగా లేకపోవడంతో పంట పొలాల వద్దనే కోళ్లఫారాల ఏర్పాటు చేసుకున్నవే అనేకం ఉన్నాయి. బ్రాయిలర్‌ కోళ్లు 45 రోజుల్లోనే రెండు కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఒక్క రోజు వయస్సు పిల్లలను వేసింది మొదలు, మార్కెట్‌కు చేరవేసేవరకు అంటే సుమారుగా రెండు నెలలపాటు కోళ్ల సంరక్షణ రైతులు చేపట్టాల్సి ఉంటుంది.

Related Posts