YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ, కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య పెరుగలేదు

దేశంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ, కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య పెరుగలేదు

న్యూఢిల్లీ జూలై 12
బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు.  ఇటీవలి కేబినెట్‌ విస్తరణను టార్గెట్‌గా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.  దేశంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ, కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య పెరుగాలేదని ఎద్దేవా చేసారు.  ఈ సందర్భంగా టీకాల గణాంకాల వివరాలను ట్విటర్‌లో రాహుల్‌ షేర్‌ చేశారు.రోజుకు సగటు టీకాల లెక్కలను వివరిస్తూ, ఇలా అయితే దేశంలో డిసెంబర్ 2021 నాటికి అందరికీ  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా పూర్తవుతుందనే సందేహాలను ఆయన లేవనెత్తారు. ‘వేర్‌ ఆర్‌ వ్యాక్సిన్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ తో రాహుల్‌ ట్విటర్‌ ద్వారా తన దాడిని ఎక్కుపెట్టారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత సమస్యపై ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్, మహమ్మారి థర్డ్‌ వేవ్‌ ఆందోళన నేపథ్యంలో దేశ జనాభాకు త్వరితగతిన టీకాలందించే కార్య్రకమాన్ని మరింత వేగవంతం చేయాలని రాహుల్‌ తాజా ట్విట్‌ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు .

Related Posts