YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉత్త‌ర భార‌తంలో పిడుగుల మోత 68 మంది మృతి

ఉత్త‌ర భార‌తంలో పిడుగుల మోత 68 మంది మృతి

లక్నో జూలై 12
ఉత్త‌ర భార‌తంలో భారీగా కురిసిన వానలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం రాత్రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ర్టాల్లో పిడుగులు ప‌డి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సోమ‌వారంఉద‌యంవ‌ర‌కుభారీపిడుగులుప‌డ్డాయి.  ఉత్తరప్రదేశ్‌లో  రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు దాదాపు 35 మంది  ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి తోడు పశు నష్టం కూడా సంభవించడం కలకలం రేపింది. ప్రాణ, పశువుల నష్టంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వంస్థానికఅధికారులనుఆదేశించింది.యూపీలోనిప్రయాగ్‌రాజ్‌లోఏకంగా 14మంది పిడుగుపాటుతో దుర్మరణం పాలయ్యారు.కాన్పూర్‌లోఅయిదుగురు, ఘజియాబాద్‌లోముగ్గురు, కౌశుంబిలో మరో ముగ్గురు చని పోగా,  ఉన్నావ్‌, చిత్రకూట్‌ ప్రాంతాలలో నలుగురు చొప్పున మరణించారు. ముఖ్యంగా భారీ వర్షం కారణంగా చెట్ల కింద ఆశ్రయం పొందిన రైతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కౌశంబి గామానికి చెందిన రుక్మ, మూరత్‌, రామచంద్ర, మయాంక్‌ సింగ్‌, అలాగే ఫిరోజాబాద్‌ మృతులను రామ్‌సేవక్, హేమరాజ్‌గా గుర్తించారు. అదేవిధంగా నాగ్లత్ చాత్ గ్రామంలో మరో రైతు అమర్ సింగ్ కూడా  ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనలపై యూపీ సీఎం యెగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాల‌కు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు. అటు భారీ వర్షాలు, పిడుగుల కారణంగా పశు నష్టం కూడా భారీగానే సంభవించింది. యూపీలోని ఉడ్ని గ్రామంలో పిడుగుపాటుకు 44 జంతువులు చనిపోయాయి. 42 మేక‌లు, ఒక ఆవు, ఎద్దు మృతి చెందిన‌ట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు రాజస్థాన్‌ ఒక్క జైపూర్‌లోనే 16 మంది మృతి చెంద‌గా, 25 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. పిడుగుపాటుపై సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతిని, సాయాన్ని ప్రకటించారు.
ప్రధాని మోదీ సంతాపం
ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల బీభత్సం కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం  తెలిపారు. బాధిత కుటుంబాలకు నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ .2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Related Posts