YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్కియాలజీ శాఖ అడ్డంకులు తొలగించాలి

ఆర్కియాలజీ శాఖ అడ్డంకులు తొలగించాలి

న్యూఢిల్లీ
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు  పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన నిర్మాణాలపై పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమనిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేసారు. తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ, జానపద కళల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న  చాతుర్మాస్య దీక్ష గురించి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని ఆకాంక్షించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి పీఠం దుశ్శాలువతో కిషన్ రెడ్డి దంపతులు సత్కరించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని దగ్గరుండి సాగనంపారు కిషన్ రెడ్డి దంపతులు.

Related Posts