ఏపీలో ప్రతిపక్షం ఫుల్ జోష్ తో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది. విశాఖలో జరిగిన వంచన వ్యతిరేక దీక్ష విజయవంతం కావడంతో ఆ పార్టీ క్యాడర్ మరింత రెట్టింపు ఉత్సాహాం వెల్లివిరిస్తోంది.రాష్ట్రంలో జిల్లా వారీగా కొనసాగుతున్న జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన రావడంతో అదే బాటలో ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై అద్యయనం చేస్తూనే రైల్వే జోన్ సాధనే ధ్యేయంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోదా తో పాటు విభజన హామీలు అములు చెయ్యకపోతే కేంధ్రంపై మరింత ఒత్తిడి పెంచుతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖలో వైకాపా చేపట్టిన వంచన వ్యతిరేక దీక్ష కేంధ్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై మాట యుద్దానికి దారి తీసింది.కేంధ్ర , రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉద్యమాలతో వైఫల్యాలను ఎండగడుతున్న వైకాపా, పాదయత్రాలతో ప్రభుత్వాలపై రాష్ట్ర ప్రయోజనాల కోసం మరింత ఒత్తిడి పెంచుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామా చేసిన ఎంపిలు, విశాఖలో జరిగిన దీక్షలో పాల్గోని ప్రత్యేక హోదాపై గళమెత్తారు .రాష్ట్రాభివృద్దికి దోహదపడే ప్రత్యేక హోదాను ఎందుకు అమలు చెయ్యరంటూ ప్రశ్నించారు .పోరాటం చెయ్యాల్సిన సమయంలో కేంధ్రంపై ఒత్తిడి తీసుకురాకుండా తిరుపతిలో ధర్మపోరాట దీక్షలు అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆ పార్టీనేతలు విమర్శించారు .ప్రత్యేక హోదా కోసం వైకాపా నిరంతరం పోరాటాలు చేస్తుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఒక బుధవారం నాడు విశాఖ లో వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై అద్యయనం చేస్తూ కొనసాగుతున్న జగన్ పాదయాత్ర తరహాలో విశాఖ రైల్వే జోన్ సాధన కోసం విజయసాయి రెడ్డి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం నుంచి బైక్ యాత్ర ను చేపట్టారు. విశాఖజిల్లా అగనంపుడిలోని వైఎస్సార్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించారు .ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు జిల్లా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన యాత్రలో ఆ పార్టీ నేతలు పాల్గోన్నారు. ప్రత్యేక హోదాపై కేంధ్రం ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడం తో వైకాపా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తుందని అన్నారు.