YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రాత్రిపూటే కర్ఫ్యూ

 ఏపీలో రాత్రిపూటే కర్ఫ్యూ

విజయవాడ, జూలై 12, 
కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఏపీలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. ఇటీవల కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ఐదు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నిబంధనలు సడలించారు. ఆ సమయాల్లో దుకాణాలు తెరుచుకునేందుకు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చారు. తాజాగా ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ నిబంధనలను సడలించనున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లోనూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారు. పది గంటలలోపు దుకాణాలు మూసివేయాలన్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కఠినంగా కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి.అలాగే కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను కూడా పటిష్టంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మాస్క్ ధరించకకుంటే రూ.100 ఫైన్ విధించాలని ఆయన ఆదేశాలిచ్చారు. దుకాణాలు, వినియోగదారులు, రోడ్లపైకి వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

Related Posts