YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇరకాటంలో పడుతున్న వైసీపీ

ఇరకాటంలో పడుతున్న వైసీపీ

న్యూఢిల్లీ, జూలై 12, 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రఘురామ మాట్లాడారు. దేవాలయాలపై దాడిని నిరసిస్తున్నానని నేను చెప్పడం వైసీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమా? నా అభిప్రాయాలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? నేనేమైనా తప్పు చేశానా? నాపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌కు కారణమేంటి? పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేస్తారా?’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. తన అభిప్రాయాలు తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. అలాగే తెలుగు దేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తనను పరామర్శ కోసం మాత్రమే కలిశారన్నారు. పరామర్శ కోసం వస్తే రాజీనామాకు లింకు పెడతారా? అని ప్రశ్నించారు. తెలుగు భాషపై ఏపీ ప్రభుత్వ తీరు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామ పేర్కొన్నారు.

Related Posts