YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

విజయసాయికి స్పీకర్ కౌంటర్

విజయసాయికి  స్పీకర్ కౌంటర్

న్యూఢిల్లీ, జూలై 12, 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌ను వైఎస్ఆర్సీపీ కోరింది. ఈ విషయంలో స్పీకర్ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాము ఏడాది నుంచి ఫిర్యాదు చేస్తుంటే పట్టించుకోవడంలేదని, ఈ విషయంలో చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో నిరసనకు వెనుకాడబోమని విజయసాయి అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్‌సభ స్పీకర్ స్పందించారు. పిటిషన్‌పై నిర్ణయం తీసుకోడానికి ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరు పక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పరిశీలన అనంతరం సభాహక్కుల కమిటీ పరిశీలనకు పంపుతామని పేర్కొన్నారు. సభలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుందని స్పీకర్ వ్యాఖ్యానించారు. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని చురకలంటించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై రన్నింగ్ కామెంటరీ చేయలేమని ఘాటుగా బదులిచ్చారు అనర్హత వేటు అంశంపై 15 రోజులు నోటీసు ఇచ్చి ప్రివిలేజ్‌కు పంపిస్తామని స్పీకర్ అంటున్నారు. ప్రివిలేజ్ కమిటీకి పంపడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రఘురామకృష్ణరాజు వైఖరితో మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగింది.. ఈ విషయంలో ఆయన ప్రివిలేజ్ ఎక్కడ దెబ్బతింది?. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేస్తే పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని స్పీకర్‌కు స్పష్టం చేశాం. జేడీయూ ఎంపీ శరద్‌ యాదవ్‌పై అనర్హత ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల్లోనే చర్యలు తీసుకున్నారు. ఆయనపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వెంటనే అనర్హత వేటు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు విషయంలో ఆలస్యం చేయకూడదు.. కానీ, రఘురామకృష్ణరాజు విషయంలో ఏడాది నుంచి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు.. స్పీకర్ వైఖరి పక్షపాతంగా కనబడుతోంది.. ఇది ఇలాగే కొనసాగితే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని స్పీకర్‌ మేం స్పష్టం చేశామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Related Posts