YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 నిరుద్యోగుల గొంతు కోసిన జగన్ ప్రభుత్వం.

 నిరుద్యోగుల గొంతు కోసిన జగన్ ప్రభుత్వం.

 నిరుద్యోగుల గొంతు కోసిన జగన్ ప్రభుత్వం.
. ఏపీ ఉద్యోగాల పోరాట సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ  
ఎమ్మిగనూరు
ఉద్యోగాల భర్తీ విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం  నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోసిందని ఏపీ ఉద్యోగ పోరాట కమిటీ నేతలు  మండిపడ్డారు
.పట్టణంలో  ఏపీ ఉద్యోగుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో  నిర్వహించిన బైక్ ర్యాలీని వైఎస్ఆర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా  డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సురేష్, పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర బాబు,ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర,ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరేశ్ యాదవ్, టిఎన్ఎస్ఎఫ్ నాగరాజు, ఏ ఐ వై ఎఫ్ రాజీవ్, ఏఐఎస్ఎ సురేంద్రబాబు మాట్లాడుతూ  ఖాళీగా ఉన్న 2,35,794 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రెండేళ్లు తర్వాత కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం దుర్మార్గమన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలలో 25 వేల ఉపాధ్యాయ ఖాళీల  గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం నాడు ఈ ఏడాది 6500  ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామన్నా సీఎం మాట తప్పారని వారు విమర్శించారు. ఏళ్ల తరబడి కోచింగ్ తోసుకుంటున్న నట్టేట ముంచారాని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్ట్లు ఐదు వేలు పోస్ట్లు ఖాళీగా ఉంటే కేవలం 36పోస్ట్లు భర్తీ చేయడం ప్రకటించడం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని  వారు డిమాండ్ చేశారు.

Related Posts