విఆర్ఏ లకు వేతనం 21,000లు ఇవ్వాలి
నామినీలను విఆర్ఏ లుగా నియమించాలి
తుగ్గలి
రాష్ట్ర వ్యాపితంగా పనిచేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులకు వేతనం రూ. 21,000 లు ఇవ్వాలని,పే స్కేల్ ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్‌ఏలుగా నియమించి,డి.ఎను వేతనం నుండి మినహాయించటాన్ని విరమించుకోని, అర్హులైన విఆర్‌ఏ లకు విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతూ జూలై,ఆగష్టు లలో జరగనున్న దశలవారీ ఆందోళనా పోరాటాలను జయప్రదం చేయాలని ఎ.పి. గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నదని వీఆర్ఏలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుగ్గలి మండల పరిధిలోని గల వీఆర్ఏలు అందరూ కలసి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు ఆర్ఐ సుధాకర్ రెడ్డి కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి : ప్రస్తుత గౌ॥ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
గారు 2017 మార్చి 24న అలంకార్ సెంటర్లో విఆర్ఎ ల ధర్నాకు హాజరై విఆర్పిలకు కనీస
వేతనం ఇస్తామని,నామినీలకు న్యాయం చేయటంతో పాటు ఇతర సమస్యలన్ని పరిష్కరిస్తామని నాడు ప్రతిపక్షనేతగా హామి ఇచ్చి ఉన్నారు.వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా విఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం అన్యాయం.వెంటనే ముఖ్యమంత్రి గారి హామి అమలుకు చర్యలు చేపట్టాలని ఎ.పి. గ్రామ రెవిన్యూ సహాయకుల
సంఘం డిమాండ్ చేస్తున్నది.
నామినీలకు విఆపలుగా నియమించాలి : రాష్ట్ర వ్యాపితంగా పనిచేస్తున్న విఆర్ఎలలో చాలా
మంది అనారోగ్యంతో, వయస్సు పైబడి విధులు నిర్వర్తించలేక పోవడంతో వారి వారసులు
విఆర్‌ఏల విధులు నిర్వర్తిస్తున్నారు.అనేక సంవత్సరాలుగా నామినీలుగా పనిచేస్తున్న వీరిని విఆర్‌ఏలుగా నియమించాలని కోరుతున్నా, నేటికి సమస్య పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం నామినీలనువిఆర్‌ఏ లుగా నియమించేందుకు ప్రతిపాదనలు తయారు చేసినప్పటికి అనేక కుంటిసాకులు చేబుతూ ఆ ప్రతిపాదనలను ప్రక్కన పెట్టిందని వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.12,13 మరియు 14 తేదీలలో మండల కేంద్రాలలో నిరసనలు,19 వ తేదీన ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసనలు,26 న కలెక్టరేట్ల వద్ద నిరసనలు చివరిగా ఆగస్టు 2,3,4 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాలను నిర్వహిస్తున్నట్లు వీఆర్ఏలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లు అంజి,రమేష్,శేఖర్,పులికొండ తదితరుల వీఆర్ఏలు పాల్గొన్నారు.