సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులుగా రాగిల్ల సత్యనారాయణ
జగిత్యాల జులై 12
సెంట్రల్ బోర్డు ఆఫ్ సర్టిఫికేషన్ సభ్యునిగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగిల్ల సత్యనారాయణను నియామకం చేశారు. సత్యనారాయణ 1985 నుండి బీజేపీ పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేస్తూ జిల్లా, రాష్ట్ర బాధ్యతలతో పాటు నియోజకవర్గ కన్వీనర్ గా మరియు వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు ఉన్నా,బీజేపీ పార్టీ సిద్ధాంతం కోసం పని చేసినందుకు ఆయనకు ఆ పదవికి నియామకం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పైడిపెల్లి సత్యనారాయణ రావు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తమ మీద నమ్మకం ఉంచి నందుకు తాను పార్టీ ఎదుగుదలకు ఆహ్షలు కృషిచేస్తానని రాగిల్ల సత్యనారాయణ తెలిపారు.