రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత
హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల జులై 12
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను అందించడం పట్ల జిల్లా కలెక్టర్ జి.రవి హర్షం వ్యక్తం చేశారు.సోమవారం జిల్లా కలెక్టరేట్లో జగిత్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో రూ.2.50 లక్షల విలువ గల ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను జిల్లా కలెక్టర్ జి.రవి చేతులమీదుగా జిల్లాలోని 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్.పుప్పాల శ్రీధర్ కు అందజేశారు.
వీటిలో రెండు రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు, రెండు ధర్మపురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు, ఒకటి కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ...కోవిడ్ బారిన పడినవారికి అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించడం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ప్రజలకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్. పుప్పాల.శ్రీధర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, వేణుగోపాల్, ధర్మపురి ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్.శ్రీనివాస్, రాయికల్ వైద్యుడు డాక్టర్. కృష్ణ చైతన్య, కొడిమ్యాల వైద్యుడు డాక్టర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.