YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వ్యాపారాల్లేక... తీవ్ర ఇబ్బందులు

వ్యాపారాల్లేక... తీవ్ర ఇబ్బందులు

రాజమండ్రి, జూలై 13,
వైరస్ మహమ్మారి దెబ్బకు వ్యాపారాల కళ పూర్తిగా తప్పింది. నిత్యావసరాల కొనుగోలు తప్ప ప్రజలు మరి దేనిపైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆదాయాలు గత మూడు నెలలుగా భారీగా అందరికి పడిపోవడంతో కొనుగోలు శక్తి ప్రజల్లో బాగా క్షిణించింది. దాంతో మార్కెట్ లు అన్ని కళావిహీనంగానే మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం షాపింగ్ మాల్స్ పై నిషేధం సడలించినా అక్కడక్కడా వైరస్ కేసులు సంబంధిత సిబ్బందికి వెలుగు చూస్తూ ఉండటంతో అవి మూత పడిపోతున్నాయి. రాజమండ్రిలో వాల్ మార్ట్ లో ఒకరికి వైరస్ సోకడం పరీక్షలు చేస్తే పదుల సంఖ్యలో మరికొందరి సిబ్బందికి పాజిటివ్ రావడంతో మాల్ హుటాహుటిన మూసివేశారు. వాస్తవానికి సాధారణ దుకాణాల కన్నా మాల్స్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సమస్యలు తప్పడం లేదు.బట్టల దుకాణాల నుంచి ఎలక్ట్రానిక్స్ షాపు ల వరకు కొనుగోలు దారులు కనిపించడం లేదు. అరకొరగా మాత్రమే వ్యాపారాలు నడుస్తున్నాయి. కనీసం సిబ్బంది వేతనాలకు, అద్దెలకు, కరెంట్ బిల్లులకు కూడా వచ్చే డబ్బులు చాలడం లేదని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. దీనికి తోడు వైరస్ భయం వెంటాడుతుంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో షాప్ లు తీయాలా మూయాలో తెలియక అయోమయంలో ఉన్నారు వ్యాపారులు.బేరాలు లేవని మొత్తం షాప్ లు బంద్ చేస్తే మొత్తం రొటేషన్ పోతుందని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వ్యాపారాలు సక్రమంగా లేకపోవడంతో జీతాలు చెల్లించలేక చాలామంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. దాంతో ఉపాధి కోల్పోయినవారు కొత్త ఉద్యోగాలు దొరక్క ఉన్న ఉద్యోగం కోల్పోయి అల్లాడుతున్నారు. ఇక సెలూన్స్ షాప్ లవారు ఇదేపరిస్థితి ఎదుర్కొంటున్నారు. పని చేస్తే వైరస్ భయం చేయకపోతే రోజు గడవని పరిస్థితి తో దిక్కుతోచని స్థితి లో ఉన్నారు.

Related Posts