YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

మళ్లా పెరుగుతున్న కరోనా కేసులు

మళ్లా పెరుగుతున్న కరోనా కేసులు

ముంబై, జూలై 13, 
దేశంలో కరోనా స్పీడ్‌‌ మళ్లీ పెరుగుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌‌ వేగం తగ్గుతుండటం, మరోవైపు వైరస్‌‌ వ్యాపించే రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా రూల్స్‌‌ను జనం పాటించకపోవడం మరింత కలవరపెడుతోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎంత వేగంగా కరోనా వ్యాపిస్తుందో ఆ విలువను ‘ఆర్‌‌ వాల్యూ’ అంటారు. చెన్నైలోని ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మాథమెటికల్‌‌ సైన్స్‌‌కు చెందిన సితభ్ర సిన్హా నేతృత్వంలోని టీమ్‌‌ ఈ ఆర్‌‌ వాల్యూను అనలైజ్‌‌ చేసింది. కరోనా పాండమిక్‌‌ పోవాలంటే ఆర్‌‌ విలువ ఒకటి కన్నా తక్కువుండాలని చెప్పింది. ఆర్‌‌ విలువ మార్చి 9 నుంచి ఏప్రిల్‌‌ 11 మధ్య 1.37గా ఉందని, మే 11 నాటికి ఒకటి కన్నా తక్కువగా 0.98గా నమోదైందని, జూన్‌‌ 16 నాటికి 0.78కు పడిపోయిందని సితభ్ర వివరించారు. కానీ లాక్‌‌డౌన్‌‌ సడలింపులు, జనం రూల్స్‌‌ పాటించకపోవడంతో వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఆ ప్రకారం జూన్‌‌ 20 నుంచి జులై 7 మధ్య ఆర్‌‌ వాల్యూ 0.78 నుంచి 0.88కు పెరిగిందని సితభ్ర చెప్పారు. ప్రస్తుతానికి ఆర్‌ వాల్యూ తక్కువగానే ఉన్నా పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలోనే పెరిగి వచ్చే నెలలో మూడో వేవ్‌ రావొచ్చని, సెప్టెంబర్‌లో పీక్‌కు వెళ్లొచ్చని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.  దేశవ్యాప్తంగా జూన్‌ 21 నుంచి జులై 10 మధ్య 9.1 కోట్ల డోసులను పంపిణీ చేశారు. అంతకుముందు జూన్‌ 1 నుంచి జూన్‌ 20 మధ్య వేసిన డోసులతో పోలిస్తే ఇది 3.05 కోట్లు ఎక్కువ. కానీ 5 రోజుల ప్రకారం వ్యాక్సినేషన్‌ను లెక్కేస్తే తగ్గుదల కనిపిస్తోంది. జూన్‌ 21 నుంచి 25 వరకు 3.27 కోట్ల డోసులు వేశారు. అంటే రోజుకు 65 లక్షల డోసులను పంపిణీ చేశారు. జూన్‌ 21న అత్యధికంగా 86 లక్షల డోసులు వేశారు. ఆ తర్వాత జూన్‌ 26 నుంచి 30 మధ్య వ్యాక్సినేషన్‌ 39 శాతం తగ్గింది. సరాసరి రోజుకు 39 లక్షల డోసులే వేశారు. జులై 1 నుంచి 5 మధ్య 6 శాతం పెరిగింది. సరాసరి రోజుకు 42 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. కానీ జులై 5 నుంచి 10 మధ్య 16 శాతం తగ్గింది. మొత్తంగా జూన్‌ 1 నుంచి జూన్‌ 5 వరకు జరిగిన వ్యాక్సినేషన్‌తో జులై 5 నుంచి జులై 10 జరిగిన దానితో పోలిస్తే వ్యాక్సినేషన్‌ 45.6 శాతం తగ్గింది.  

Related Posts