YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐసీడీఎస్ ను కాపాడాలి

ఐసీడీఎస్ ను కాపాడాలి

నెల్లూరు
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,ఎపిలో వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఓ పథకం ప్రకారం ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించాయని సిఐటియు అధ్వర్యంలో జరిగిన నిరసనకు మహిళలు పోటెత్తారు. అంగన్వాడీల అఖిల భారత కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో ఇటీవల విడుదల చేసిన 172 సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని, అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట భారీ స్థాయిలో అంగన్వాడీలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విఆర్సి నుంచి అంబేద్కర్ బొమ్మ మీదుగా కలెక్టరేట్ వరకు మహిళ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మెప్పుకోసమే కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన జాతీయ నూతన విద్యావిధానం 2020ని దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. ముందుగా వి.ఆర్.సి క్రీడా మైదానం నుంచి అంగన్వాడీలు భారీ ర్యాలీ ప్రదర్శనగా బయలు దేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 172 సర్య్కులర్ అమలు చేస్తే 3 సంవత్సరాల పిల్లలు ప్రాథమిక పాఠశాలలకు, 3,4 తరగతుల విద్యార్ధులు హైస్కూల్కు వెళ్లాల్సి వస్తుందన్నారు. ప్రాథమిక విద్యకోసం విద్యార్థులు 3,4 కిలోమీటర్లు  వెళ్లాల్సి వస్తుందన్నారు.దీని వల్ల పేద పిలలకు ముఖ్యంగా ఎస్సి,ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు చదువుకు దూరం అవుతారన్నారు. ఐసిడిఎస్ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు .కరోనా సమయంలో మృతి చెందిన అంగన్వాడీల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల భీమా సౌకర్యం కల్పించా లన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగఅవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన అంగన్వాడీలు భారీ సంఖ్యలో వచ్చారు.

Related Posts