YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వర్క్ ఫ్రమ్ హోమ్ కు మంచి డిమాండ్

వర్క్ ఫ్రమ్ హోమ్ కు మంచి డిమాండ్

హైద్రాబాద్, జూలై 13, 
లాక్ డౌన్తో ఉపాధి కోల్పోయిన వారు, కరోనా వ్యాప్తితో జాబ్కు దూరమైన వారు ఇంట్లోనే ఉండి ఇన్కం పొందే మార్గాలు వెతుకుతున్నారు. పార్ట్ టైం, ఫుల్ టైం వర్క్ ఫ్రం హోం బేస్డ్ జాబ్స్ కోసం ఆన్లైన్లో సెర్చ్‌‌‌‌ చేస్తున్నారు. సిటీలో కరోనా కేసులు పెరుగుతుండగా, కంపెనీలన్నీ తక్కువ సిబ్బందితో పని చేయిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు జాబ్‌‌‌‌ల నుంచి తొలగించడంతో చాలామంది ఎంప్లాయ్స్ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కొన్ని కంపెనీలు ఇంటి నుంచే పని చేసేలా తాజాగా రిక్రూట్ చేసుకుంటుండం వారికి కలిసి వస్తోంది. కంప్యూటర్ నాలెడ్జ్‌‌‌‌, టైపింగ్, టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారిని రిక్రూట్ చేసేందుకునే కన్సల్టెన్సీలు ముందుకొస్తున్నాయి. పార్ట్ టైం, ఫుల్ టైం, ఫ్రీ లాన్స్ చేసే వారికి రిక్రూటర్లు జాబ్ ఆఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం, బీపీవో, టెలీకాలర్, ఆన్ లైన్ డేటా ఎంట్రీ, ఫ్రీ లాన్స్ ఎస్ఈఓ జాబ్స్ తోపాటు క్యాప్చా ఎంట్రీ, ఆన్ లైన్ ఫాం ఫిల్లింగ్, డిజిటల్ సర్వే జాబ్ ల కోసం ఆన్ లైన్ ద్వారా రిక్రూట్‌‌‌‌ చేసుకుంటున్నారుసిటీలో దిల్సుఖ్నగర్, గాంధీనగర్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ ఏరియాల్లో  రిక్రూటింగ్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ మొదలు దాదాపు ఆఫీసులన్నీ వర్క్ ఫ్రం హోం ఫాలో అవుతున్నాయి. దాంతో తక్కువ శాలరీకి పని చేసే వారిని కన్సల్టెన్సీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా జాబ్ ప్రొఫైల్‌‌‌‌ను బట్టి సెలెక్ట్‌‌‌‌ చేస్తున్నాయి. పని గంటలు, వర్క్ ప్రోగ్రెస్ ఆధారంగా  శాలరీ ఇస్తున్నాయి. వారం లేదా15 రోజులకు పేమెంట్ చేస్తున్నట్లు  అమీర్ పేటకు చెందిన డేటా ఎంట్రీ జాబ్ రిక్రూటర్ నాగరాజు తెలిపారు. 20 రోజుల నుంచి పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ కోసం ఇచ్చే డిజిటల్ క్లాసిఫైడ్స్కు కాల్స్ పెరిగాయని, ఇతర జిల్లాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి టైమ్లో అర గంట పని చేస్తే వందల్లో సంపాదన అంటూ ఇచ్చే ప్రకటనలతో ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉంది. కంపెనీ, వెబ్ సైట్, కల్పించే పని ఆధారంగా కన్సల్టెన్సీలను సెలెక్ట్‌‌‌‌ చేసుకోవాలి. పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ కల్పిస్తామని ప్రాసెసింగ్, అడ్మిషన్ ఫీజు పేరిట కొంత మొత్తం వసూలు చేసి, తప్పించుకునేవారు ఉంటారు. దానికి బదులుగా ఆన్ లైన్ లో వర్క్ ఫ్రం హోం కల్పించే వెబ్ సైట్లను చూడాలి. ఫీజులు, చార్జీలు లేకపోతేనే ముందుకెళ్లాలి. బ్యాంక్ డీటెయిల్స్ఎవరికీ షేర్ చేయొద్దని రిక్రూటర్లు, సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts