YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీకి ఫేస్ బుక్ ఫాలోవర్ప్ 43.2 లక్షలు

మోడీకి ఫేస్ బుక్ ఫాలోవర్ప్ 43.2 లక్షలు

ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. మోదీ ఖాతాను 43.2 మిలియన్ల మంద అనుసరిస్తుండగా.. రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే ఇది దాదాపు రెండింతలు కావడం గమనార్హం. బర్సన్-మార్ట్‌స్టెల్లర్ అనే కమ్యూనికేషన్స్ సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా ట్రంప్ కొనసాగుతున్నప్పటికీ.. ఫేస్‌బుక్‌లో ఆయన వెనుకంజలో ఉండటానికి ఆసియాలో ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వాడటమే కారణం. ఫేస్‌బుక్‌లో ట్రంప్‌ను 23.1 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. 9.6 మిలియన్ల మంది ఫాలోవర్లతో కాంబోడియా ప్రధాని హున్ సెన్ షాట్‌ ఐదోస్థానంలో ఉండటం విశేషం. బర్సన్-మార్ట్‌స్టెల్లర్ 2017 జనవరి 1 నుంచి 650 మంది వ్యక్తులు, సంస్థల ఫేస్‌బుక్ పేజీలను విశ్లేషించింది. ట్రంప్ పేజిలో మొత్తం 204.9 మిలియన్ల కామెంట్లు, లైకులు, షేర్లు వచ్చాయి. ఇది మోదీ ఫేస్‌బుక్ పేజీ కంటే దాదాపు రెట్టింపు.ట్రంప్ సగటున రోజుకు ఐదుసార్లు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇది మోదీ కంటే రెండింతలు ఎక్కువ కావడం విశేషం. ఫాలోవర్ల పరంగా ట్రంప్ తర్వాతి స్థానంలో జోర్డాన్‌కి చెందిన క్వీన్ రైనా (16 మిలియన్లు) మూడో స్థానంలో ఉన్నారు.

Related Posts