హైద్రాబాద్, జూలై 13,
కరోనా వైరస్ జనం బతుకులను ఆగం చేస్తోంది. నిండు ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా.. ఆత్మహత్యల రూపంలోనూ జీవితాలను తుడిచిపెట్టే స్తోంది. కరోనాను కట్టడి చేయడానికని పెట్టిన లాక్ డౌన్.. జనం సావులకొచ్చింది. చేయడానికి పని లేక కొందరు.. పని చేసినా గిట్టుబాటుకాక మరికొంద రు.. బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల లాక్ డౌన్ వల్ల బతుకు భారమై పలువురు సూసైడ్‌చేసుకున్నారు. కరోనాతో లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. పనులు, ఉపాధి లేక అనేక మంది ఖాళీగా ఉంటున్నారు. ఫలితంగా కుటుంబ పోషణ భారమైంది. అప్పులు పుట్టడంలేదు. ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో ఒత్తిడి, డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. అయితే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో ఆర్ధికంగా నష్టపోయిన కులవృత్తులు, చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు 10 నుంచి 20 వేల రూపాయల వరకు సాయం చేస్తున్నాయి. మన రాష్ట్రంలో సర్కార్ వీరిని పట్టించుకోవడం లేదు. లక్షల ఉద్యోగాలు పోయినయ్.. కరోనా నేపథ్యం లో మార్చి 22 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైంది. దేశం మొత్తం స్తంభించిపోయింది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని డిపార్ట్ మెంట్స్ ఆగిపోయాయి. ఐటీ, మాల్స్, షోరూమ్‌లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఆటోలు, క్యాబ్‌లు, హోటళ్లు, పర్యాటకం, మానుఫాక్చరింగ్, సినిమా వంటి ఇండస్ట్రీ లన్నీ బంద్ అయ్యాయి. ఐటీలాంటి అనేక సంస్థల్లో వర్క్ ఫ్రం చేయించుకున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగాల నుంచే తీసేశాయి. దీంతో లక్షల మంది రోడ్డునపడ్డారు. చేసేదేమీ లేక సొంతూర్లబాట పట్టారు. ప్రభుత్వం సైతం మూడు నెలలపాటు సగం జీతాలే ఇచ్చింది. దీన్నిఆసరాగా చేసుకుని అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా సగం జీతాలే ఇచ్చాయి. కొన్ని కంపెనీలైతే అసలు జీతాలే ఇయ్యలేదు. నిరుద్యోగంలో 9వ స్థా నం.. దేశంలో నిరుద్యోగ రేటులో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. జూన్‌నెలలో రాష్ట్రంలో 15.5 శాతం అన్‌ఎం ప్లాయిమెంట్ పర్సెం ట్ రికార్డయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన సర్వేలో పేర్కొంది. జాతీయ నిరుద్యోగ రేటు 10.99ను రాష్ట్రం దాటిపోయింది. దేశంలో 33.6 శాతంతో హర్యానా ఫస్ట్‌ప్లేస్ లో ఉంది. పక్క రాష్ట్రం ఏపీ 24వ స్థానంలో ఉంది. ఇక ఇదే సంస్థచేసిన సర్వేలో మే నెలలో తెలంగాణలో 34.8% నిరుద్యోగ రేటు ఉన్నట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్య చేసుకున్నవారిలో చాలామంది చిరు ద్యోగులు ఉన్నారు. లాక్‌డౌన్ వల్లవారంతా ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గట్టెక్కే మార్గం కనిపించక సూసైడ్ చేసుకుంటున్నారు. ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఆర్ధిక ఇబ్బందులను తప్పించుకోలేమన్న నిరాశతో ఆత్మహత్య చేసుకుంటున్నారని సైకాలజిస్టులు విశ్లేషిస్తున్నారు.