శ్రీకాకుళం
రాజాం మున్సిపాలిటీ పరిధిలోని సారధి నుంచి అంతకాపల్లి కి వెళ్లే దారిలో వ్యవసాయం కోసం అవసరమైన ట్రాన్స్ఫార్మర్ వెయ్యడం కోసం రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏఈ ఏసీబీ కి చిక్కిన సంఘటన రాజాం లో చోటుచేసుకుంది. సారధికి చెందిన టంకాల దిలీప్ అనే వ్యక్తి 10 రోజులు క్రితం తన పొలానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వెయ్యాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చెయ్యాలంటే రూ.80వేలు లంచం ఇవ్వాలని ఏఈ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. దీంతో దిలీప్ శ్రీకాకుళం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఎస్పీ ఏ వీ వీ రమణమూర్తి ఆధ్వర్యంలో రంగంలోకి ఏసీబీ అధికారులు నేరుగా రాజాం ట్రాన్స్కో ఏడీఈ కార్యాలయంలో దిలీప్ నుంచి లంచం తీసుకుంటున్న ఏఈ లక్ష్మణరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని రాజాం పోలీస్ స్టేషన్ కి అప్పజెప్పి, కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు