YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల

కొండల్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల

వనపర్తి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష జరిగంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.  షర్మిల మాట్లాడుతూ సిఎం కేసిఆర్ మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రతి మంగళవారం నిరుద్యోగ దినంగా,నిరసన దినంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటిస్తుంది. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం వారికి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ మూడు రోజుల నిరాహార దీక్ష చేపట్టాను. ఉద్యోగుల పక్షాన పోరాటాన్ని ప్రారంభించాను. ఆ పోరాట స్ఫూర్తితో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతా. దేశంలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ దున్నపోతు పై వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నాడు.. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.  అంతకుముందు ఆమె ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Related Posts