YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోర్టుల్లో ఇంటర్ నెట్ సౌకర్యాలు

కోర్టుల్లో ఇంటర్ నెట్ సౌకర్యాలు

కోర్టుల్లో ఇంటర్ నెట్ సౌకర్యాలు
హైకోర్టు విచారణ
అమరావతి
దిగువ కోర్టుల్లో ఇంటర్నెట్ సదుపాయాలను మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై.. హైకోర్టు స్పందించింది . ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది . విచారణను పది రోజులకు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది . కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానాల్లో విచారణలు జరగుతున్నాయని , పలు జిల్లాల్లోని దిగువ కోర్టులో ఇంటర్నెట్ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో  విచారణలకు విఘాతం కలుగుతోందని పేర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయవాదులు హైకోర్టులో పిల్ వేశారు . వారి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్.విజయ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు . తక్షణ కర్తవ్యంగా ఇంటర్నెట్ సౌకర్యాల్ని మెరుగుపరచాలని కోరారు . కొన్ని జిల్లాలోని దిగువ న్యాయస్థానాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేదన్నారు . ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. వివరాలు సమర్పించాలని ఏజీ శ్రీరామ్ కు స్పష్టంచేసింది .

Related Posts